న్యూఢిల్లీ, జూన్ 5: తమిళనాడు బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలై పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లతో అన్నామలై భేటీ అయ్యారు. ఐదు పేజీల రాజీనామా లేఖను వారికి అందించారు. అదే రోజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కూడా అన్నామలై కలిశారు. బీజేపీ నుంచి తాను వైదొగలటానికి గల కారణాలను ఆయనకు వివరించారు. పార్టీ అన్నామలై రాజీనామాను ఆమోదిస్తుందా? లేదా అన్న ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ శుక్రవారం అన్నామలై రాజీనామాను అంగీకరించారు.