న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ లండన్‌లో చేదు అనుభవం ఎదురైంది. బిర్క్‌బెక్ కాలేజీలో ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. జూన్ 4వ తేదీన ఈ ఘటన జరిగింది. అయితే భారతీయ హై కమిషన్ ఈ ఘటనను ఖండించింది. లండన్ కాలేజీలో ప్రసంగం చేస్తున్న సమయంలో జరిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్‌లో కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ లెక్చర్‌కు హాజరైన కొందరు చీఫ్ జస్టిస్‌ను ప్రశ్నలతో నిలదీశారు. భారత్‌లో భావస్వేచ్ఛ లేదని ఆరోపించారు. నిరుద్యోగులను బొద్దింకలతో పోల్చడాన్ని ప్రశ్నిస్తూ కామెంట్లు చేశారు. అయితే ఆ ప్రశ్నోత్తరాల ఈవెంట్‌ను నిర్వాహకులు తక్షణమే రద్దు చేశారు. ఇది టాపిక్‌లో లేని అంశమని పేర్కొన్నారు.