🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 06 June 2026, 11:36 AM Posted by: MANA VISHWAM

నిద్రహారాలు మాని జొన్న టోకెన్ల కోసం కుభీర్ రైతుల నిరీక్షణ.. క్యూలైన్‌లో తోపులాట

భాసాగా మారింది. మూడు కౌంటర్లు ఏర్పాటు చేసిన టోకెన్లు ఇస్తుండగా రైతుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో మహిళ రైతులు కిందపడటంతో స్వల్పంగా గాయపడ్డారు.

ఐకేపీ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి నుంచి టోకెన్లు జారీ చేస్తుండటంతో శుక్రవారం రాత్రి నుంచే ఐకేపీ కార్యాలయానికి చేరుకుని రైతులు బారులు తీరారు. కార్యాలయ ఆవరణలో చీకటిలో బండరాళ్లు క్యూలో పెట్టి అక్కడే ఇరువైపులా పడుకున్నారు. నిద్రాహారాలు మాని అక్కడే టోకెన్ల కోసం నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఉదయం 9.30గంటల నుంచి సంబంధిత అధికారులు వచ్చి టోకెన్లు ఇవ్వడం మొదులపెట్టారు. మండలంలోని వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు తరలిరావడంతో కౌంటర్ల వద్ద తోపులాట జరిగింది. ఈ క్రమంలో పలువురు రైతులు కిందపడి, స్వల్పంగా గాయపడ్డారు.

పంట కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్‌కు మద్దతు ధర రూ.3700 కాగా, ప్రైవేటు వ్యాపారులు మాత్రం రూ.2200 ఇస్తున్నారని.. అందుకే టోకెన్ల కోసం ఇన్ని తిప్పలు పడాల్సి వస్తుందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇలాంటి కష్టం రాలేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుందని మండిపడ్డారు. రైతులు పండించిన ఉత్పత్తులను అమ్ముకునేందుకు ఇన్ని కష్టాలా అంటూ మహిళా రైతుల రేవంత్ సర్కార్‌ను తిడుతున్నారు.
🏠 Home