🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 06 June 2026, 11:40 AM Posted by: MANA VISHWAM

ఢిల్లీకి చేరుకున్న కాక్రోచ్ పార్టీ ఫౌండ‌ర్‌.. బుక్‌, జెండా ప‌ట్టుకురావాల‌ని ట్వీట్

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ ఉద్య‌మానికి చెందిన‌ కాక్రోచ్ జ‌న‌తా పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దీప్కే ఇవాళ ఢిల్లీ చేరుకున్నాడు. న‌గ‌రంలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ప్ర‌ణాళిక ప్ర‌కారం నిర‌స‌న చేప‌ట్ట‌నున్నాడు. అయితే ఆందోళ‌న‌కారుల‌కు అభిజీత్ పిలుపునిచ్చారు. క్ర‌మ‌శిక్ష‌ణ‌తో నిర‌స‌న చేప‌ట్టాల‌న్నారు. ప్ర‌ద‌ర్శ‌న శాంతియుతంగా జ‌ర‌గాల‌న్నారు. ఢిల్లీలో విమానం దిగిన‌ట్లు అభిజీత్ త‌న ఎక్స్ అకౌంట్‌లో ఓ పోస్టు చేశారు. జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద క‌లిసేందుకు ఎదురుచూస్తున్న‌ట్లు ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు. బుక్‌తో పాటు జాతీయ జెండాను ప‌ట్టుకుని రావాల‌ని త‌న ట్వీట్‌లో తెలిపాడు.
🏠 Home