🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 06 June 2026, 11:42 AM Posted by: MANA VISHWAM

తనను తాను సృష్టించుకోనున్న ఏఐ!.. ఆంత్రోపిక్‌ హెచ్చరిక

ఏఐ తనను తాను సొంతంగా సృష్టించుకునే సామర్థ్యం పొందినప్పుడు దాని మీద మనుషులు నియంత్రణ కోల్పోవచ్చని ఆంత్రోపిక్‌ ఏఐ కంపెనీ హెచ్చరించింది. ఆ స్థాయికి ఏఐ వెళ్లిన తర్వాత మనుషుల సాయం లేకుండానే సమర్థవంతమైన వ్యవస్థలను సృష్టించుకోగలదని కంపెనీ తెలిపింది. ఆంత్రోపిక్‌ కంపెనీ మరో సూచన కూడా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక ఏఐ వ్యవస్థలను రూపొందించడం కూడా కంట్రోల్‌ చేయాలని సూచించింది.
ఎందుకంటే కొత్త టెక్నాలజీతో వస్తున్న ఏఐ మనుషుల నియంత్రణ నుంచి సులభంగా తప్పించుకోగలదని తెలిపింది. ఏఐ అభివృద్ధిని ఏఐ వ్యవస్థలకే అప్పగిస్తే.. తనను తాను సొంతంగా క్రియేట్‌ చేసుకునే శక్తిని ఏఐ పొందుతుందని.. ఇది మానవ అతీత శక్తికి దారి తీస్తుందని ఆంత్రోపిక్‌ స్పష్టం చేసింది. ప్రస్తుతం క్లౌడ్‌ వ్యవస్థ అత్యంత సమర్థవంతమైన కోడ్‌ ను రాయగలదని ఆంత్రోపిక్‌ కంపెనీ తెలిపింది.
🏠 Home