🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 06 June 2026, 11:48 AM Posted by: MANA VISHWAM

చ‌రిత్ర సృష్టించిన ఆర్ ప్ర‌జ్ఞానంద‌.. ప్ర‌తిష్టాత్మ‌క నార్వే చెస్ టైటిల్ సొంతం

భార‌తీయ చెస్ గ్రాండ్‌మాస్ట‌ర్ ఆర్ ప్ర‌జ్ఞానంద(R Praggnanandhaa) చ‌రిత్ర సృష్టించాడు. ప్ర‌తిష్టాత్మ‌క నార్వే చెస్ టైటిల్‌ను కైవ‌సం చేసుకున్నాడు. నార్వే చెస్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా రికార్డు క్రియేట్ చేశాడు. త‌న ఆఖ‌రి రౌండ్‌లో జ‌ర్మ‌నీ ప్లేయ‌ర్ విన్సెంట్ కేయ్‌మెర్‌ను ఓడించిన 20 ఏళ్ల ప్ర‌జ్ఞానంద‌.. అద్భుత‌మైన రీతిలో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. 15 పాయింట్ల‌తో చివ‌రి గేమ్‌ను ప్రారంభించిన ప్ర‌జ్ఞానంద‌.. క్లాసిక‌ల్ గేమ్‌ను గెలిచి కీల‌క‌మైన మూడు పాయింట్ల‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. దీంతో అత‌నికి మొత్తం 18 పాయింట్లు వ‌చ్చేశాయి. ఇక చెస్ టోర్నీల్లో ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే నార్వే టైటిల్ అత‌న వ‌శ‌మైంది. ఈ గెలుపుతో చెన్నై కుర్రాడు అద్భుతాన్ని సృష్టించాడు. భార‌తీయ లెజెండ‌రీ చెస్ ప్లేయ‌ర్ విశ్వ‌నాథ‌న్ ఆనంద్‌, ప్ర‌స్తుత ప్ర‌ప‌చం చాంపియ‌న్ డీ గుకేశ్ కూడా ఇప్ప‌టి వ‌ర‌కు నార్వే చెస్ టోర్నీ గెలుచుకోలేక‌పోయారు. ఈ టోర్నీని 2013 నుంచి నిర్వ‌హిస్తున్నారు.
🏠 Home