రూ.కోటి పరువు నష్టం కోరిన టీవీకే నేత ఆదవ్ అర్జున్
డ్రగ్స్ కేసు ఆరోపణలపై తమిళనాడులో రాజకీయ దుమారం
తమిళనాడు రాజకీయాల్లో డ్రగ్స్ కేసు వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారంటూ తమిళగ వెట్రి కళగం (TVK) ముఖ్య నాయకుడు ఆదవ్ అర్జున్.. డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు లీగల్ నోటీసులు పంపారు. సీఎం స్టాలిన్‌తో పాటు డీఎంకే ఐటీ విభాగానికి కూడా నోటీసులు జారీ చేసిన ఆయన.. 48 గంటల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడం ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అసలేం జరిగిందంటే..?
ఇటీవల డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో 'జాన్ బ్రిట్టో' అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది. అయితే, ఈ నిందితుడితో ఆదవ్ అర్జున్‌కు సంబంధాలు ఉన్నాయంటూ డీఎంకే ఐటీ వింగ్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన టీవీకే నేత.. ఎలాంటి ఆధారాలు లేకుండా తనను నేరగాళ్లతో ముడిపెడుతూ, తన రాజకీయ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు అధికార పార్టీ కుట్ర పన్నిందని మండిపడ్డారు.
రూ. కోటి పరువు నష్టం.. బేషరతు క్షమాపణ!
డీఎంకే సోషల్ మీడియా వేదికగా చేస్తున్న తప్పుడు ప్రచారం వల్ల తాను తీవ్ర మానసిక వేదనకు గురయ్యానని ఆదవ్ అర్జున్ తన నోటీసులో పేర్కొన్నారు. ప్రజల్లో తన వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి చూపేలా ఈ కుట్ర సాగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నోటీసులోని ప్రధాన డిమాండ్లు:
సీఎం ఎంకే స్టాలిన్, డీఎంకే ఐటీ వింగ్ తక్షణమే బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి.
తన పరువుకు భంగం కలిగించినందుకు, మానసిక క్షోభకు గురిచేసినందుకు గాను రూ. 1 కోటి పరిహారంగా చెల్లించాలి.
నోటీసు అందిన 48 గంటల్లోగా ఈ డిమాండ్లపై స్పందించాలి.
కోర్టుకు వెళ్తామంటూ హెచ్చరిక
విధించిన గడువులోగా ముఖ్యమంత్రి స్టాలిన్ లేదా డీఎంకే వర్గాల నుంచి ఎలాంటి స్పందన రాకపోతే.. సివిల్, క్రిమినల్ చట్టాల కింద న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆదవ్ అర్జున్ హెచ్చరించారు. తప్పుడు ప్రచారానికి ఒడిగట్టిన ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెడతామన్నారు.
తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని 'టీవీకే' పార్టీ ఆవిర్భావం తర్వాత రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార డీఎంకే వర్సెస్ టీవీకే అన్నట్లుగా సాగుతున్న ఈ తాజా వివాదం మున్ముందు ఎలాంటి మలుపులు తిరుగుతుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.