రూ.2 కోట్ల విలువైన ప్రభుత్వ భూమికి ప్రహరీ..
నాలా కన్వర్షన్ పేరుతో ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసే యత్నమా..?
ఒక సర్వే నెంబర్‌లో నాలా.. మరో సర్వే నెంబర్‌లో ప్రహారీ నిర్మాణం..?
హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపహాడ్ శివారులో ప్రభుత్వ భూమి ఆక్రమణకు సంబంధించిన వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న సుమారు 10 గుంటల ప్రభుత్వ భూమిని దక్కించుకునేందుకు ఓ పలుకుబడి కలిగిన బడా కాంట్రాక్టర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
స్థానికంగా ప్రచారం జరుగుతున్న వివరాల ప్రకారం, సుమారు రూ.2 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ముందుగా నాలా కన్వర్షన్ ప్రక్రియను అస్త్రంగా ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి పేరుతో భూమి మార్పిడి ప్రక్రియ చేపట్టి, అనంతరం పక్కనే ఉన్న ప్రభుత్వ భూమిని చదును చేసి ప్రహారీ నిర్మించినట్లు సమాచారం.
నాలా ఒక సర్వే నెంబర్‌లో.. ప్రహారీ మరో సర్వే నెంబర్‌లో..?
వివాదానికి కేంద్రబిందువుగా మారిన భూమి విషయంలో నాలా కన్వర్షన్ సర్వే నెంబర్ 613లో చేయించుకున్నప్పటికీ, వాస్తవంగా ప్రహరీ మాత్రం సర్వే నెంబర్ 516లోని ప్రభుత్వ భూమిలో జరిగినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
రికార్డుల ప్రకారం సర్వే నెంబర్ 613లో మొత్తం 1 ఎకరం 26 గుంటల భూమి ఉండగా, ప్రస్తుతం భౌతికంగా (పొజిషన్‌లో) కేవలం 1 ఎకరం 10 గుంటలు మాత్రమే ఉన్నట్లు సమాచారం. అంటే రెవెన్యూ రికార్డులు (ఆర్‌ఎస్‌ఆర్) మరియు ప్రస్తుత టిప్పన్ వివరాల మధ్య సుమారు 16 గుంటల తేడా ఉన్నట్లు చెబుతున్నారు.
ఈ వ్యత్యాసాన్నే అవకాశంగా మలుచుకున్న కొందరు వ్యక్తులు, సర్వే నెంబర్ 613లో 10 గుంటలకు నాలా కన్వర్షన్ పొందినట్లు చూపించి, దానికి ఆనుకుని ఉన్న సర్వే నెంబర్ 516లోని ప్రభుత్వ భూమిని చదును చేసి ప్రహరీ కట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ భూమినే 613గా చూపే ప్రయత్నమా..?
ప్రస్తుతం చదును చేసిన భూమిని సర్వే నెంబర్ 613లో భాగంగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని నెలల క్రిందట భూమిని సమతలీకరణ చేసి, చుట్టూ ప్రహారీ నిర్మించినట్లు తెలుస్తోంది.ఈ వ్యవహారంపై రెవెన్యూ అధికారులు సమగ్ర సర్వే నిర్వహించి,వంగపహాడ్ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లు 613 మరియు 516ల సరిహద్దులను స్పష్టంగా నిర్ధారించాలని స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ భూమి ఆక్రమణ జరిగి ఉంటే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.