ఏకాంతానికి అడ్డొస్తున్నాడని రెండేళ్ల చిన్నారిని కొట్టి చంపిన కసాయి తల్లి
ఫిట్స్ అంటూ భర్తను నమ్మించి అంత్యక్రియలు.. నిలదీయడంతో వెలుగులోకి దారుణం
తీగుళ్లలో విషాదం.. కీసర పోలీసుల నిఘాలో రీ-పోస్ట్‌మార్టం
అమ్మ అనే పిలుపులో అమృతం ఉంటుంది. బిడ్డకు కాస్త నలత చేస్తే ఆ తల్లి గుండె కోసుకుపోతుంది. కానీ, ఇక్కడో కన్నతల్లి పరాయి వ్యక్తి మోజులో పడి, తనే ప్రాణమిచ్చిన కన్నపేగును నిలువునా తుంచేసింది. తన సుఖాల కోసం, ఏకాంతానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో కేవలం రెండేళ్ల పసికందును ప్రియుడితో కలిసి కొట్టి చంపింది. సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం తీగుళ్లకు చెందిన ఒక కుటుంబంలో జరిగిన ఈ అమానవీయ ఘటన సమాజాన్ని తలదించుకునేలా చేసింది.
రెక్కల కష్టం ఒకరిది.. విక్రుత చేష్టలు మరొకరిది
తీగుళ్ల గ్రామానికి చెందిన ఒక పేద కుటుంబం బతుకుదెరువు కోసం కొన్నాళ్ల క్రితం మేడ్చల్ జిల్లా కీసర పరిధికి వలస వచ్చింది. భర్త ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య ఇంట్లోనే ఉంటూ రెండేళ్ల కుమారుడిని చూసుకునేది. ఈ క్రమంలోనే ఆమెకు నవీన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్త పనికి వెళ్లిన సమయమే ఆసరాగా చేసుకుని నవీన్ నిత్యం ఆమె ఇంటికి వచ్చేవాడు.
‘వాడు నాకు నచ్చలేదు.. చంపేయ్!’
కొంతకాలంగా సాగుతున్న వీరి అక్రమ సంబంధానికి ఆ రెండేళ్ల పసివాడు అడ్డుగా అనిపించాడు. ఆ బాలుడు తనకు నచ్చలేదని, అడ్డు తొలగించుకుందామని ప్రియుడు నవీన్ అనడంతో.. ఆ కసాయి తల్లిలో మాతృత్వం మంటగలిసిపోయింది. ఇద్దరూ కలిసి ఆ పసికందుపై పశువులకన్నా దారుణంగా దాడి చేశారు. ఆ చిన్నారి ఏడుస్తున్నా జాలి లేకుండా తలపై బలంగా కొట్టారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆ పసిప్రాణం అక్కడికక్కడే విగతజీవిగా మారింది. పాపం పండటంతో నవీన్ అక్కడి నుంచి మెల్లగా జారుకున్నాడు.
నమ్మించిన నాటకం..
సాయంత్రం అలసిపోయి ఇంటికి వచ్చిన భర్తకు కుమారుడి శవాన్ని చూపిస్తూ.. బాబుకు ఫిట్స్ (అనారోగ్యం) వచ్చి చనిపోయాడంటూ ఆ తల్లి కన్నీరుమున్నీరై నమ్మించింది. భార్య మాటలను నిజమేనని నమ్మిన ఆ తండ్రి, గుండెనొప్పితోనే బాబుకు అంత్యక్రియలు పూర్తి చేశాడు.
అనుమానంతో గుట్టురట్టు..
ఈ ఘటన గత నెల 30 వ తేదీన జరిగింది. అయితే అంత్యక్రియలు ముగిసిన తర్వాత భార్య ప్రవర్తనలో ఆ తండ్రికి తేడా కనిపించింది. కొడుకు చనిపోయినా పెద్దగా బాధపడకపోవడం, ఫోన్లలో మాట్లాడుతుండటంతో అనుమానం వచ్చి గట్టిగా నిలదీశాడు. భర్త నిలదీసేసరికి పాపం పారేసి, అసలు నిజం ఒప్పుకుంది. దీంతో నిర్ఘాంతపోయిన ఆ తండ్రి గుండె పగిలినంత పనైంది. వెంటనే కీసర పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని వేడుకున్నాడు.
మృతదేహం వెలికితీత.. నిందితురాలి అరెస్ట్
బాలుడి తండ్రి ఫిర్యాదు చేయడంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి, బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. గాంధీ ఆస్పత్రి వైద్యుల సమక్షంలో రీ-పోస్ట్‌మార్టం నిర్వహించగా.. తలకు బలమైన గాయాలు కావడం వల్లే బాలుడు మృతి చెందినట్లు నివేదిక ఇచ్చారు. దీంతో పోలీసులు సదరు కసాయి తల్లిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. పరారీలో ఉన్న ప్రియుడు నవీన్ కోసం గాలిస్తున్నారు.
స్థానికుల ఆగ్రహం..
కన్నకొడుకునే బలితీసుకున్న ఆ కసాయి తల్లిపై, ఆమెకు సహకరించిన ప్రియుడిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అమానవీయ ఘటనలకు పాల్పడిన నిందితులను సమాజం క్షమించదని, వారికి అత్యంత కఠినమైన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.