శాశ్వత ఆస్తుల సృష్టితో తెలంగాణ ముఖచిత్రాన్ని మార్చిన మాజీ సీఎం విజన్
సచివాలయం నుంచి కాళేశ్వరం దాకా... యాదాద్రి నుంచి కమాండ్ కంట్రోల్ సెంటర్ వరకు అన్నీ అద్భుతాలే!
BY PRAMOD NAMEENDLA / మన విశ్వం ప్రత్యేక ప్రతినిధి
ఒక దేశ చరిత్రను మార్చాలన్నా... ఒక రాష్ట్ర భవిష్యత్తును తిరగరాయాలన్నా కేవలం పరిపాలన చేస్తే సరిపోదు, శతాబ్దాల పాటు నిలిచిపోయే దృఢమైన సంకల్పం, భావితరాలకు భరోసానిచ్చే విజన్ ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆ బాధ్యతను భుజానికెత్తుకున్న మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు (కేసీఆర్) ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిన మహా నిర్మాణాలే నేడు తెలంగాణను దేశంలోనే ప్రత్యేక రాష్ట్రంగా నిలబెట్టాయి. భవనాలు అంటే కేవలం ఇటుకలు, సిమెంట్ కాదని... అవి ఒక జాతి ఆత్మగౌరవ ప్రతీకలని నిరూపిస్తూ, పరిపాలన, సాగునీరు, తాగునీరు, వైద్యం, విద్య, భద్రత, ఆధ్యాత్మిక, సాంస్కృతిక రంగాల్లో కేసీఆర్ సృష్టించిన శాశ్వత ఆస్తులు నేటికీ ఆయన అసాధారణ విజన్‌కు నిలువెత్తు నిదర్శనాలుగా సాక్ష్యమిస్తున్నాయి.
పరిపాలనలో నూతన అధ్యాయం.. విప్లవాత్మక సంస్కరణలు
తెలంగాణ పాలనా వ్యవస్థకు గుండెకాయ లాంటి 'డా. బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయం' ఇండో-సార్సెనిక్, కాకతీయ శైలుల అద్భుత సమ్మేళనంతో దేశంలోనే అత్యంత ఆధునిక ఐకానిక్ కట్టడంగా రూపుదిద్దుకుంది. కేవలం రాజధానిలోనే కాకుండా, పరిపాలనను ప్రజల చెంతకు చేర్చాలనే సంకల్పంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అత్యాధునిక హంగులతో నిర్మించిన 'సమీకృత జిల్లా కలెక్టరేట్ భవనాలు ' కేసీఆర్ పాలనా వికేంద్రీకరణకు నిదర్శనాలు. ప్రజాప్రతినిధులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేలా హైదరాబాద్‌లో నిర్మించిన సువిశాల ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్,రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు ప్రజాపాలనకు కొత్త రూపాన్నిచ్చాయి.
సాగు-తాగు నీటి రంగాల్లో ప్రపంచ రికార్డులు
తెలంగాణను పీడిస్తున్న కరవు రక్కసిని శాశ్వతంగా పారద్రోలేందుకు గోదావరి నదిపై నిర్మించిన 'కాళేశ్వరం ప్రాజెక్టు' ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల సాగునీటి ప్రాజెక్టుగా రికార్డు సృష్టించింది. లక్ష ఎకరాలను పచ్చని పసిడి రంగులోకి మార్చిన ఈ ప్రాజెక్టు తెలంగాణ వ్యవసాయ రంగానికి వెన్నెముకగా నిలిచింది. మరోవైపు, ఫ్లోరైడ్ మహమ్మారి నుంచి పల్లెలను విముక్తం చేస్తూ, ప్రతి ఇంటికీ శుద్ధి చేసిన నల్లా నీటిని అందించిన 'మిషన్ భగీరథ' పథకం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకొని, తెలంగాణను తాగునీటి కష్టాల్లేని రాష్ట్రంగా మార్చింది.
ఆధ్యాత్మిక వైభవం.. సాంస్కృతిక ఆత్మగౌరవం
దక్షిణ భారత శిల్పకళా వైభవానికి మకుటాయమానంగా పూర్తిగా కృష్ణశిలలతో 'యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని' దివ్యక్షేత్రంగా పునర్నిర్మించిన ఘనత కేసీఆర్‌దే. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు, సామాజిక న్యాయానికి ప్రతీకగా హుస్సేన్ సాగర్ తీరాన నిలిపిన 125 అడుగుల భారీ డా. బి.ఆర్. అంబేద్కర్ కాంస్య విగ్రహం, అమరవీరుల త్యాగాలకు గుర్తుగా నిరంతరం వెలిగే 'తెలంగాణ అమరవీరుల స్మారకం (అమరజ్యోతి)' రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ప్రపంచ నలుమూలలా చాటుతున్నాయి. బంజారాహిల్స్‌లో నిర్మించిన బంజారా భవన్, ఆదివాసీ భవన్ వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవ ప్రతీకలుగా నిలిచాయి.
వైద్యం, విద్యారంగాల్లో కార్పొరేట్ విప్లవం
పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వైద్యం అందించడమే లక్ష్యంగా హైదరాబాద్ నలుమూలలా తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించారు. "ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ" అనే చారిత్రాత్మక నిర్ణయంతో వైద్య విద్యను సామాన్యుడికి చేరువ చేశారు. ఇక వరంగల్ (ఓరుగల్లు) లో 24 అంతస్తులతో కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా నిర్మితమవుతున్న అత్యాధునిక హెల్త్ సిటీ, రాష్ట్రంలోని మెజారిటీ నియోజకవర్గాల్లో ఏర్పాటైన వంద పడకల ఆసుపత్రులు గ్రామీణ ఆరోగ్య రక్షణలో మైలురాళ్ళు. అలాగే గ్రామీణ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేలా వివిధ నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన మోడల్ స్కూళ్లు విద్యారంగంలో సరికొత్త బాటలు వేశాయి.
భద్రతలో గ్లోబల్ టెక్నాలజీ
శాంతిభద్రతల పరిరక్షణలో అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పుతూ హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించిన 'తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్' అత్యాధునిక సాంకేతికతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. నగర రక్షణ, ట్రాఫిక్ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణను ఒకే గొడుగు కిందికి తెచ్చి శాంతిభద్రతల్లో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టింది.
రాష్ట్ర నిర్మాణ దశలోనే "భవిష్యత్ తరాలకు ఉపయోగపడే శాశ్వత ఆస్తులను సృష్టించాలి" అనే ఆలోచనతో కేసీఆర్ విజన్ సాగింది. ఈ ప్రాజెక్టులు, నిర్మాణాలపై రాజకీయంగా విమర్శలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ... ఒకే ఒక్క దశాబ్ద కాలంలో ఇంతటి భారీ స్థాయి మౌలిక వసతులను కల్పించి, తెలంగాణకు ఒక అంతర్జాతీయ బ్రాండ్ ఇమేజ్‌ను, ప్రత్యేక గుర్తింపును తీసుకురావడంలో కేసీఆర్ మార్క్ విజన్ స్పష్టంగా కనిపిస్తోందని రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు ముక్తకంఠంతో అంగీకరిస్తున్నారు.
"రేపటి భవిష్యత్తు కోసమే ఈ మహత్తర నిర్మాణాలు"
సచివాలయం నుంచి కాళేశ్వరం వరకు... యాదాద్రి ఆలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు... మెడికల్ కాలేజీల నుంచి కమాండ్ కంట్రోల్ సెంటర్ వరకు కేసీఆర్ హయాంలో నిర్మితమైన ప్రతి ఒక్క ప్రాజెక్టు కేవలం భవనాలు కావు... అవి తెలంగాణ ప్రగతి ప్రయాణంలో చెరిపేయలేని మైలురాళ్ళు. శతాబ్దాల పాటు దేశచరిత్రలో తెలంగాణను ప్రత్యేకంగా నిలబెట్టే సజీవ సాక్ష్యాలు!