కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హన్మంతరావుపై బీఆర్‌ఎస్ నేత మన్నె క్రిశాంక్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మైనంపల్లి ప్రస్తుత పరిస్థితి "ధోబీకా కుత్తా.. నా ఘర్ కా నా ఘాట్ కా" అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలు ఎలా తిరుగుతున్నాయో, కాంగ్రెస్ పార్టీలో కూడా కొందరు పిచ్చి కుక్కల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మైనంపల్లికి ప్రస్తుతం మానసిక చికిత్స అవసరమని, కొడుకు కారణంగా ఆయనకు రాజకీయంగా పని లేకుండా పోవడంతోనే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
ఒకే రోజు మూడు పార్టీలు మారిన చరిత్ర!
మైనంపల్లి హన్మంతరావు గత రాజకీయ చరిత్రను గుర్తు చేస్తూ క్రిశాంక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.గతంలో టీడీపీలో ఉన్న సమయంలో మైనంపల్లిని నగర బహిష్కరణ చేశారని గుర్తు చేశారు.2014ఏప్రిల్ 8న మైనంపల్లి ఒకే రోజు మూడు పార్టీలు మార్చి రికార్డు సృష్టించారని ఆరోపించారు. పొద్దున టీడీపీ, మధ్యాహ్నం కాంగ్రెస్ చుట్టూ తిరిగిన ఆయన, ఎక్కడా టికెట్ దక్కకపోవడంతో సాయంత్రానికి కేటీఆర్ కాళ్ల వద్దకు వచ్చారని విమర్శించారు.
'దమ్ముంటే ఒంటరిగా రా..' అంటూ సవాల్!
రౌడీయిజాలకు బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని క్రిశాంక్ భరోసా ఇచ్చారు. "మైనంపల్లి.. నీకు నిజంగానే దమ్ము, ధైర్యం ఉంటే, నువ్వు హీరో అనుకుంటే ఒంటరిగా రా.. చూసుకుందాం. లేదు నీకు చేతకాదనుకుంటే నీ కొడుకుని కూడా వెంట బెట్టుకురా" అంటూ బహిరంగ సవాల్ విసిరారు. మైనంపల్లి ఒంటరిగా వస్తే ఒంటరిగానే ఎదుర్కొంటామని, గుంపుగా వస్తే బీఆర్‌ఎస్ శ్రేణులంతా గుంపుగా వచ్చి బుద్ధి చెప్తారని హెచ్చరించారు.