వాహనాల తనిఖీ చేస్తుండగా దూసుకొచ్చిన బొగ్గు టిప్పర్.. అక్కడికక్కడే మృతి
సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి; విచారణకు ఆదేశం
భూపాలపల్లి, జూన్ 22:(మన విశ్వం )
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పరకాల-భూపాలపల్లి హైవేపై విధి నిర్వహణలో ఉన్న జిల్లా రవాణా అధికారి (DTO) / మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (MVI) ఎం. వెంకన్న బొగ్గు టిప్పర్ ఢీకొని అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
ఘటన వివరాలు...
భూపాలపల్లి స్థానిక రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయం ముందే ఈ ప్రమాదం సంభవించింది. కార్యాలయం ఎదురుగా ఉన్న హైవేపై అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో వేగంగా దూసుకొచ్చిన ఒక బొగ్గు టిప్పర్, రోడ్డుపై తనిఖీలు చేస్తున్న డిటిఓ వెంకన్నపైకి బలంగా దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో టిప్పర్ చక్రాల కింద నలిగి వెంకన్న మృతదేహం నుజ్జునుజ్జయ్యింది. ఆయన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.
కేవలం 15 రోజుల క్రితమే వెంకన్న భూపాలపల్లికి బదిలీపై వచ్చారు. విధి నిర్వహణలో చేరి రెండు వారాలు కూడా గడవక ముందే ఆయన ఇలా అనంత లోకాలకు వెళ్లడం రవాణా శాఖలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన పోలీసులు.. టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి
భూపాలపల్లిలో విధి నిర్వహణలో ఉన్న డిటిఓ ఎం. వెంకన్న మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘోర ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి, తక్షణమే నివేదిక సమర్పించాలని రవాణా శాఖ జాయింట్ కమిషనర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని, వారిని ఆదుకుంటామని సిఎం భరోసా ఇచ్చారు.
ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి పొన్నం ప్రభాకర్
రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు.
"రవాణా శాఖ కార్యాలయం వద్ద విధినిర్వహణలో భాగంగా వాహనాల తనిఖీలు చేస్తున్న సమయంలో టిప్పర్ ఢీకొనడంతో వెంకన్న అక్కడికక్కడే మృతి చెందడం నన్ను తీవ్ర బాధకు గురిచేసింది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది," అని మంత్రి పేర్కొన్నారు.
మృతుడి కుటుంబంలో ఈ ఘటన తీవ్ర శోకాన్ని మిగిల్చింది. తోటి అధికారులు, సిబ్బంది వెంకన్న హఠాన్మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.