🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 22 June 2026, 10:51 PM Posted by: MANA VISHWAM

రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ: వికారాబాద్ మెట్రో ఫేజ్-2పై చర్చలు

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన చురుగ్గా సాగుతోంది. ఇందులో భాగంగా సోమవారం ఆయన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశమయ్యారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డితో కలిసి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, రైల్వేమంత్రితో పలు కీలక రాష్ట్ర ప్రాజెక్టులపై చర్చించారు.

వికారాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్టుకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఈ భేటీలో కోరారు.తెలంగాణ మీదుగా వెళ్లే కీలక రూట్ల రైళ్ల నిలుపుదల (హాల్టింగ్) పై నేతలు ఈ సందర్భంగా సమీక్షించారు.

"​కిషన్ రెడ్డి కి లేఖ" నేపథ్యంలో ప్రాధాన్యత

​ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి ఒక బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. వికారాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని, రైల్వేమంత్రితో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆ లేఖలో కోరారు.​సీఎం లేఖకు సానుకూలంగా స్పందించిన కిషన్ రెడ్డి, స్వయంగా రేవంత్ రెడ్డిని వెంటబెట్టుకుని రైల్వేమంత్రి వద్దకు తీసుకెళ్లడంతో ఈ తాజా భేటీకి అత్యంత రాజకీయ, పరిపాలనా ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రాభివృద్ధి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందడుగు వేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది
🏠 Home