కోర్టు కేసులో ఉన్న భూమికి పట్టా జారీ...వెలుగులోకి తహసీల్దార్ అక్రమ మ్యుటేషన్
అక్రమం బయటపడటంతో సర్వే నంబర్ బ్లాక్..
భాధితుల ఫిర్యాదు తో ఫైలు పంపాలంటూ ఆర్డీఓ లేఖ.. అసలు ఆ ఫైలు కార్యాలయంలో భద్రంగా ఉందా?
తహసీల్దార్ లీలలు వెలుగుచూసి 20 రోజులు గడుస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లున్న యంత్రాంగం..
కలెక్టర్ స్పందనపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పరకాల ప్రజలు
న్యాయాన్ని రక్షించాల్సిన అధికార్లే అక్రమార్కులకు కొమ్ముకాస్తే ఇక సామాన్యుడికి దిక్కెవరు? కోర్టు పరిధిలో ఉన్న భూమిని కంటిముందు కనిపిస్తున్నా కాసులకు కక్కుర్తి పడి పట్టాలు మార్చేస్తే పేదల గోడు ఎవరు వినాలి? హన్మకొండ జిల్లా పరకాల మండల రెవెన్యూ కార్యాలయంలో సాగుతున్న ఇలాంటి ఓ బాగోతం ఇప్పుడు నియోజకవర్గంలో దావానలంలా వ్యాపించింది. కోర్టు వివాదంలో ఉన్న భూమికి నిబంధనలకు విరుద్ధంగా పట్టా జారీ చేసిన పరకాల తహసీల్దార్ వ్యవహారం ఇప్పుడు జిల్లావ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అక్రమం కాస్తా వెలుగులోకి రావడంతో రెవెన్యూ అధికారులు సదరు సర్వే నంబర్‌ను బ్లాక్ చేసినప్పటికీ.. తప్పు చేసిన తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవడంలో ఎందుకు జాప్యం జరుగుతోందనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
అసలేం జరిగిందంటే..?
బాధితులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... హన్మకొండ జిల్లా పరకాల మండలం మాదారం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 665లో గల 16గుంటల భూమి ప్రస్తుతం న్యాయస్థానంలో వివాదంలో ఉంది. ఈ భూమిపై కోర్టు కేసు నడుస్తుండటంతో, దీనిపై ఎలాంటి రిజిస్ట్రేషన్లు గానీ, మ్యుటేషన్లు గానీ చేయవద్దని బాధితులు గత మార్చి నెలలోనే పరకాల తహసీల్దార్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.చేశారు.
ఫిర్యాదు బుట్టదాఖలు.. చకచకా పట్టాలు!
సాధారణంగా కోర్టు కేసుల్లో ఉన్న భూములపై స్టేటస్ కో (యథాతథ స్థితి) కొనసాగించాల్సి ఉంటుంది. కానీ పరకాల తహసీల్దార్ మాత్రం బాధితులు ఇచ్చిన ఫిర్యాదును పూర్తిగా బుట్టదాఖలు చేశారు. అంతటితో ఆగకుండా, సదరు వివాదాస్పద 16 గుంటల భూమిని తలా 8గుంటల చొప్పున ఇద్దరు వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేయడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. ఈ వ్యవహారంలో ముడుపులు భారీస్థాయిలో చేతులు మారాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
సర్వే నంబర్ బ్లాక్.. మరి అధికారిపై చర్యలేవి?
తహసీల్దార్ చేసిన అక్రమ మ్యుటేషన్ వ్యవహారం రచ్చకెక్కడం, బాధితులు ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో రెవెన్యూ శాఖ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇందులో భాగంగా వివాదాస్పద సర్వే నంబర్ 665ను ప్రస్తుతానికి బ్లాక్ చేశారు. అయితే, తప్పు జరిగిందని అంగీకరిస్తూ సర్వే నంబర్‌ను బ్లాక్ చేసిన అధికారులు.. ఆ తప్పుకు కారణమైన తహసీల్దార్‌ను మాత్రం ఎందుకు వెనకేసుకొస్తున్నారని పరకాల మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
భాధితుల ఫిర్యాదు తో సదరు మ్యుటేషన్‌కు సంబంధించిన పూర్తి ఫైలును తమకు పంపాలంటూ ఆర్డీఓ కార్యాలయం నుంచి పరకాల తహసీల్దార్‌కు లేఖ అందింది. అయితే, ఆ మ్యుటేషన్‌కు సంబంధించిన అసలు ఫైలు కార్యాలయంలో భద్రంగా ఉందా? లేదా? ఆర్డీవో కు తహసీల్దార్ ఆ ఫైలు పంపించారా లేదా అనేది ఆర్డీవో కే తెలియాలి.ఈ అక్రమ భాగోతం వెలుగులోకి వచ్చి, ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినప్పటికీ.. 20 రోజులుగా తహసీల్దార్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
కలెక్టర్ చర్యలు తీసుకునేనా?
ఈ అవినీతి అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, బాధ్యురాలైన తహసీల్దార్ విజయ లక్ష్మి పై జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు తీసుకుంటారా? లేదా? అని పరకాల మండల ప్రజలు, బాధితులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి బాధితులకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.