సొంతింటి కల నిజం చేసుకునేందుకు ఎదురుచూస్తున్న సామాన్యులకు తెలంగాణ హౌజింగ్ బోర్డు సరికొత్త శుభవార్త అందించింది. హైదరాబాద్ పరిధిలో భారీ ఎత్తున లక్ష ప్లాట్ల నిర్మాణానికి బోర్డు కసరత్తులు ప్రారంభించింది. అయితే, ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే ఈ సరికొత్త హౌజింగ్ స్కీమ్‌కు ఒక మంచి పేరును సూచించే బాధ్యతను ప్రజలకే అప్పగించింది. పేరు పెట్టండి.. "లక్ష రూపాయల నగదు బహుమతి గెలుచుకోండి " అంటూ తెలంగాణ హౌజింగ్ బోర్డు ఒక సూపర్ కాంటెస్ట్‌ను అనౌన్స్ చేసింది.
ప్రజల నుండి వచ్చే సూచనలలో అత్యంత ఆకర్షణీయంగా, అర్థవంతంగా ఉండే ఉత్తమ పేరును హౌజింగ్ బోర్డు ఎంపిక చేస్తుంది. విజేతకు రూ. 1లక్ష నగదు బహుమతిగా అందజేస్తారు.
ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 28వ తేదీ లోపు తమ పేర్లను సూచించాల్సి ఉంటుంది.
తెలంగాణ హౌజింగ్ బోర్డు అధికారిక ఇన్ స్టాగ్రామ్ పేజీని సందర్శించి ఈ పోటీలో పాల్గొనవచ్చని బోర్డు వైస్ చైర్మన్ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ వాసులకు ఇళ్ల స్థలాలను అందించే ఈ మెగా ప్రాజెక్టుకు మీ సృజనాత్మకతతో ఒక చక్కటి పేరును ఆలోచించి, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి లక్ష రూపాయలు గెలుచుకునే ఈ సువర్ణ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు!