కాశీబుగ్గలో కల్తీ పచ్చళ్ల గుట్టురట్టు.. టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి!
రూ. 2.25 లక్షల విలువైన కుళ్లిపోయిన నిల్వలు స్వాధీనం
అపరిశుభ్ర వాతావరణంలో తయారీ.. నిందితుడు శ్రీనివాస్ అరెస్ట్
వరంగల్, జూన్ 25(మన విశ్వం ):
ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటూ, అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో అక్రమంగా నడుస్తున్న ఒక కల్తీ పచ్చడి తయారీ కేంద్రంపై వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. నగరంలోని కాశీబుగ్గ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ నకిలీ దందాను రట్టు చేసి, ఒకరిని అరెస్ట్ చేయడంతో పాటు రూ. 2.25 లక్షల విలువైన కుళ్లిపోయిన నిల్వలను స్వాధీనం చేసుకున్నారు.
కూరగాయలు కావు.. కుళ్లిపోయిన వ్యర్థాలు!
ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాశీబుగ్గ సాయి వీధిలో గల ఒక ఇంట్లో ఈ అక్రమ కేంద్రం నడుస్తున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు నివాసంలో సోదాలు నిర్వహించగా విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. పూర్తిగా కుళ్లిపోయిన టమోటాలు, మామిడికాయలతో పచ్చళ్లు తయారు చేస్తూ.. వాటిని చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి స్థానిక కిరాణా షాపులు, హోటళ్లకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది.
ఈ దాడిలో కాశీబుగ్గకు చెందిన అరికెల శ్రీనివాస్ (51) అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నివాసంలో నిల్వ ఉంచిన దాదాపు 750 కిలోల టమోటా, 900 కిలోల మామిడి, 200 కిలోల నిమ్మకాయలు, 100 కిలోల ఉసిరికాయలతో పాటు 150 కిలోల కల్తీ అల్లం-వెల్లుల్లి పేస్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ. 2.25 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. పట్టుబడిన నిందితుడిని, కుళ్లిపోయిన సరుకును తదుపరి చర్యల కోసం ఇంతేజార్‌గంజ్ పోలీసులకు అప్పగించారు.
బ్రాండ్ లేని పచ్చళ్లతో తస్మాత్ జాగ్రత్త!
ప్రజలు మార్కెట్లో లభించే బ్రాండ్ లేని, అనుమానాస్పద ఆహార పదార్థాలు మరియు పచ్చళ్లను కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని టాస్క్ ఫోర్స్ అధికారులు సూచించారు. ఎక్కడైనా ఇలాంటి కల్తీ నిల్వ కేంద్రాలు లేదా నకిలీ ఆహార పదార్థాల విక్రయాలు జరుగుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ఈ విజయవంతమైన దాడిని ఏసీపీ టాస్క్ ఫోర్స్ ఎ. మధుసూదన్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ బండారి రాజు, ఆర్‌ఎస్‌ఐ ఓ. భాను ప్రకాష్ మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది అత్యంత చాకచక్యంగా నిర్వహించారు.