తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లపాటు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి కంటే విధ్వంసానికే ప్రాధాన్యం ఇచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్ రావుపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ, "బావబామ్మర్దులు తోడేళ్లలా తెలంగాణపై పడ్డారు" అని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా శాశ్వతంగా తిరస్కరించారని, వారికి మరోసారి అధికార బాధ్యతలు అప్పగించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.
ఆదివారం నల్గొండ జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అనంతరం ఎన్జీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, గత ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
"పదేళ్లలో వందేళ్ల విధ్వంసం"
బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని సీఎం ఆరోపించారు. రాష్ట్రాన్ని భారీ అప్పుల ఊబిలోకి నెట్టేసి, భవిష్యత్ తరాలపై భారం మోపారని విమర్శించారు. "పదేళ్లలో వందేళ్ల విధ్వంసం సృష్టించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే" అని వ్యాఖ్యానించారు.
"త్యాగాల పేరుతో రాజకీయ ప్రచారం"
తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు చేశామని బీఆర్ఎస్ నేతలు చెప్పుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని సీఎం విమర్శించారు. "త్యాగం అంటే రాజీనామాలు చేసి ఎన్నికలు తెచ్చుకోవడమా? లేక కలెక్షన్లు చేయడమా?" అంటూ ఎద్దేవా చేశారు.
తెలంగాణ కోసం నిజమైన త్యాగాలు చేసిన మహనీయులను గుర్తు చేస్తూ, తొలి దశ ఉద్యమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ మంత్రి పదవిని వదులుకున్నారని, మలిదశ ఉద్యమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా తన పదవిని త్యాగం చేశారని తెలిపారు. ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి వంటి అమరుల సేవలను మరువలేమన్నారు.
"త్యాగం ప్రజలది.. ఫలితం కుటుంబానిది"
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలాది మంది విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రజలు చేసిన పోరాటాన్ని టీఆర్ఎస్ నాయకత్వం తమ ఖాతాలో వేసుకుందని సీఎం ఆరోపించారు. రాష్ట్ర సాధనలో ప్రజల పాత్ర అపారమైతే, అధికార పదవులు మాత్రం కేసీఆర్ కుటుంబానికే పరిమితమయ్యాయని విమర్శించారు.
హరీశ్ రావును ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేసిన సీఎం, "పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టె తెచ్చుకున్న వాళ్లు ఇప్పుడు త్యాగాల గురించి మాట్లాడుతున్నారు" అంటూ వ్యంగ్యంగా స్పందించారు.
"ప్రజలే తీర్పు చెప్పారు"
పదేళ్లపాటు అధికారాన్ని అనుభవించిన తర్వాత రాష్ట్రాన్ని దోచుకున్నారనే భావనతో ప్రజలు కేసీఆర్ కుటుంబాన్ని తిరస్కరించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు ఇప్పటికే తమ తీర్పును ఇచ్చారని, రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి, సంక్షేమం దిశగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు.
అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు