రూ.9 రోజుల్లో రైతుల ఖాతాల్లో రూ.9 వేల కోట్లు
కేసీఆర్, మోదీపై ఒకేసారి విమర్శలు
శిల్పకళా వేదికలో రైతు భరోసా నిధుల విడుదల ప్రారంభం
బీఆర్ఎస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయల కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును హడావుడిగా నిర్మించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. లక్ష కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు దెబ్బతిన్నప్పటికీ, తెలంగాణ ప్రస్తుతం వరి సాగులో దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం రైతుల కష్టానికి నిదర్శనమని అన్నారు. బోర్ల కింద సాగు చేసిన పంటలకూ కాళేశ్వరం ఘనతగా ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు.
హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో రైతు భరోసా నిధుల పంపిణీని ప్రారంభించిన అనంతరం సీఎం మాట్లాడుతూ, రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లో తొమ్మిది రోజుల వ్యవధిలో రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులను జమ చేస్తామని ప్రకటించారు. సాగు పనులు ప్రారంభమయ్యే సమయానికే రైతులకు ఆర్థిక చేయూత అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం రూ.8.11 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టిందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికే ఇబ్బందికర పరిస్థితి నెలకొన్నదని, విద్యార్థుల మధ్యాహ్న భోజన బిల్లులు, సర్పంచ్‌ల బకాయిలు సహా అనేక చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. ఆ బకాయిలన్నింటినీ ప్రస్తుత ప్రభుత్వం దశలవారీగా చెల్లిస్తూ ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతోందని చెప్పారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించిన రేవంత్ రెడ్డి, రైతు రుణమాఫీని ఒక్కసారైనా పూర్తిగా అమలు చేశారా? దళితులకు మూడు ఎకరాల భూమి ఇచ్చారా? పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఇంటికో ఉద్యోగం కల్పించారా? అని ప్రశ్నించారు. వరి సాగు చేయొద్దని రైతులను బెదిరించి, చివరకు పంట కొనుగోలు విషయంలోనూ నిర్లక్ష్యం ప్రదర్శించారని ఆరోపించారు. ప్రజలకు మేలు చేయకుండా మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకునే నైతిక హక్కు బీఆర్ఎస్‌కు లేదన్నారు.
కేంద్ర ప్రభుత్వంపైనా సీఎం విమర్శలు చేశారు. ప్రతి పేద కుటుంబ ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తామని, ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీలు అమలు కాలేదని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీకి ప్రజల విశ్వాసం సంపాదించాలంటే ఇంకా చాలా కాలం పడుతుందని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుకువచ్చామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో పాటు మహిళల ఆధ్వర్యంలో బస్సుల యాజమాన్యానికి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. రెండేళ్లలోనే 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని వెల్లడించారు.
వ్యవసాయంపై మాట్లాడిన సీఎం, ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపిక చేసుకోవాలని సూచించారు. వ్యవసాయాన్ని భారంగా కాకుండా లాభదాయకమైన పండుగగా మార్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. రైతుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు