ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్, గౌరవ వేతన ప్రాతిపదికన పనిచేస్తున్న సిబ్బందికి ఈ నెల తొలి రోజైన బుధవారం జీతాలను ఆర్థిక శాఖ విడుదల చేసింది.
జీతాల చెల్లింపులో తరచూ ఎదురవుతున్న జాప్యం వల్ల ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, గౌరవ వేతన సిబ్బందికి కూడా ప్రతి నెల జీతాలు ఆలస్యం కాకుండా అందేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల అధికారులను ఆదేశించారు.
ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖలు, విభాగాలకు ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది. జీతాల బిల్లుల సమర్పణ, పరిశీలన, ఆడిట్, ఆథరైజేషన్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించింది.
సర్క్యులర్ ప్రకారం ప్రతి నెల 25వ తేదీలోగా జీతాలు, రెమ్యునరేషన్ బిల్లులను ట్రెజరీ, పే అండ్ అకౌంట్స్, సంబంధిత అకౌంట్స్ విభాగాలకు సమర్పించాలని సూచించింది. అలాగే నెల చివరి పని దినానికల్లా బిల్లుల పరిశీలన, ఆడిట్, ఆథరైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
బుధవారం ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాల చెల్లింపుల పురోగతిపై ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ అధికారులను సమీక్షించారు. ఈ నెలకు సంబంధించిన బిల్లులు అందిన అన్ని శాఖలు, విభాగాల ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు జమ చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యతో ఇకపై కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, గౌరవ వేతన సిబ్బందికి ప్రతి నెల నిర్ణీత సమయంలోనే వేతనాలు అందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.