🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 02 July 2026, 10:15 AM Posted by: MANA VISHWAM

గురుకులాల టెండర్ల లొల్లి: ప్రెస్ క్లబ్‌లో ‘కౌంట్ డౌన్’ షురూ! ​

గురుకులాల టెండర్ల అవినీతి రాజకీయం ఇప్పుడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా రసవత్తరంగా మారింది. "అవినీతి జరిగింది.. నిరూపిస్తాం!" అంటూ బీఆర్‌ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కొప్పుల ఈశ్వర్, గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉదయం 11 గంటలకే ప్రెస్ క్లబ్‌కు చేరుకుంటున్నారు.
​మరోవైపు, బీఆర్‌ఎస్ సవాల్‌ను స్వీకరించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, మహ్మద్ అజారుద్దీన్ తాము కూడా చర్చకు సై అంటూ సిద్ధమయ్యారు. ఇరుపక్షాల నేతలు ముఖాముఖి తలపడేందుకు రెడీ అవ్వడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మంత్రుల సమక్షంలోనే ఆధారాలు బయటపెడతామని విపక్షం అంటుంటే, ఏ నిమిషంలో ఏం జరగబోతోందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
🏠 Home