'డ్రామారావు', 'అగ్గిపెట్టె రావు'లకు తెలంగాణ ప్రజలే బుద్ధి చెబుతారు
అవినీతికి కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్.. చర్చలకు భయపడి పారిపోయేది మీరే!
ఫార్మ్‌హౌస్ రాష్ట్ర సమితి (FRS)గా మారిన గులాబీ పార్టీ: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్
గడిచిన పదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డగోలుగా కొల్లగొట్టి, అవినీతికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారిన బీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు అధికారంలో ఉన్నామనే భ్రమలో ప్రతిరోజూ అసత్య ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుల తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, వారి పేర్లకు తగ్గట్టే ఇద్దరూ కలిసి అద్భుతంగా డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. అధికారం కోల్పోయిన తర్వాత 'ఫార్మ్‌హౌస్ రాష్ట్ర సమితి' (ఎఫ్ఆర్ఎస్ )గా మారిన పార్టీలో పట్టు కోసం బావబామ్మర్దులు సాగిస్తున్న ఆధిపత్య పోరాటమే ఈ డ్రామాలకు కారణమని ఆయన విమర్శించారు.
చర్చల నుంచి 'వాకౌట్' వీరులు మీరే!
కాంగ్రెస్ ప్రభుత్వంతో చర్చల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదని మంత్రి పొంగులేటి కొట్టిపారేశారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఆధారాలతో సహా బీఆర్ఎస్ అవినీతిని బట్టబయలు చేస్తుంటే సమాధానం చెప్పలేక పారిపోయిన చరిత్ర వారిదన్నారు.
చేసిన అప్పులపై శ్వేతపత్రం విడుదల చేసి చర్చ పెడితే... వాకౌట్!,విద్యుత్ కొనుగోళ్ళ అంశంలో అడ్డగోలు అవినీతి, అక్రమాలపై చర్చ పెడితే... వాకౌట్!,కాళేశ్వరం ప్రాజెక్టు రీ-డిజైనింగ్ పేరిట చేసిన దోపిడీపై చర్చ పెడితే...వాకౌట్!,
గొర్రెల పంపిణీ విషయంలో లబ్ధిదారుల సొమ్మును నొక్కేసిన ఘనకార్యంపై చర్చ పెడితే...వాకౌట్! ఇంతవరకు ఏ ఒక్క చర్చను ఎదుర్కొనే ధైర్యం లేని బీఆర్ఎస్ నేతలు, ఇప్పుడు ప్రజాప్రభుత్వంపై బురద చల్లాలని చూడటం సిగ్గుచేటని మండిపడ్డారు.
గన్‌పార్క్‌లో తేలిపోయిన బీఆర్ఎస్ ప్రగల్భాలు
గురుకులాల టెండర్లలో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ నేతలు చేసిన తలతిక్క లెక్కలపై చర్చకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని మంత్రి గుర్తుచేశారు. ప్రభుత్వ పారదర్శకతకు, ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనంగా మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్‌తో పాటు ఇతర నాయకులు చెప్పిన సమయానికి గన్‌పార్క్‌కు చేరుకున్నారని తెలిపారు. కానీ, సవాల్ విసిరిన బీఆర్ఎస్ నేతలు మాత్రం అక్కడికి రాకుండా తోక ముడిచారని, తమ పార్టీ ఆఫీస్ రోడ్డుపై డ్రామాలు చేస్తూ కాలయాపన చేశారని దుయ్యబట్టారు.
గ్లోబల్ ప్రచారాలు మానుకోకపోతే ప్రతిపక్ష హోదా కూడా దక్కదు!
అబద్ధాలను ప్రచారం చేయడంలో బీఆర్ఎస్ నేతలు గ్లోబల్ స్థాయికి చేరారని పొంగులేటి విమర్శించారు. ఇప్పటికైనా ఈ అసత్య ప్రచారాలు, రాజకీయ డ్రామాలను మానుకోవాలని హితవు పలికారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ నేతల్లో మార్పు రాలేదని, కనీసం దక్కిన ప్రతిపక్ష హోదా నైనా కాపాడుకోవాలని సూచించారు. ఇదే తీరు, ఇదే అహంకారంతో మున్ముందు ప్రవర్తిస్తే భవిష్యత్తులో ప్రజలు ఆ ప్రతిపక్ష హోదాను కూడా ఉంచరని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.