తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత సి. జోసెఫ్ విజయ్‌పై బహిరంగ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో డీఎంకే ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనితా ఆర్. రాధాకృష్ణన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మద్రాస్ హైకోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కొద్దిసేపటికే ఈ అరెస్ట్ జరిగింది.
వివాదం నేపథ్యం ఏమిటి?
జూన్ 20న మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి జయంతిని పురస్కరించుకుని తిరుచెందూర్ సమీపంలోని ఆత్తూర్‌లో ఓ బహిరంగ సభ జరిగింది.ఈ సభలో అనితా రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ ప్రవర్తనను, ఆయన సినీ రంగం నేపథ్యాన్ని మరియు వ్యక్తిగత జీవితాన్ని ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగింది.
కోర్టు వ్యాఖ్యలు – అరెస్ట్
ముఖ్యమంత్రి ప్రతిష్టకు భంగం కలిగించారంటూ టీవీకే కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆత్తూర్ పోలీసులు రాధాకృష్ణన్‌పై పరువు నష్టం, ఘర్షణలకు ప్రేరేపించడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.దీనిపై రాధాకృష్ణన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్పందిస్తూ, "తమిళనాడు ప్రజలు విజయ్‌ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు, కాబట్టి ఆయనను గౌరవించాలి. పిటిషనర్ సాధారణ వ్యక్తి కాదు, ఒక ఎమ్మెల్యే అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదు" అని పేర్కొన్నారు. బెయిల్ నిరాకరణ తర్వాత, నియోజకవర్గంలో పనుల పరిశీలనలో ఉన్న రాధాకృష్ణన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
డీఎంకే(DMK )తీవ్ర ఆగ్రహం
అనితా రాధాకృష్ణన్ అరెస్టును డీఎంకే నాయకత్వం తీవ్రంగా ఖండించింది.
మాజీ సీఎం స్టాలిన్ స్పందిస్తూ "ముఖ్యమంత్రి విజయ్ సినిమా యాక్షన్ స్టైల్‌లో 'పోలీస్ రాజ్' నడుపుతున్నారు. రాజకీయ విమర్శలకు ఇలా అర్ధరాత్రి అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధం" అని మండిపడ్డారు.
ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్, ఎంపీ కనిమొళి కూడా ఈ అరెస్టును తీవ్రంగా తప్పుబడుతూ, ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి అణచివేత ధోరణిని అవలంబిస్తోందని, దీనిపై తాము ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడతామని స్పష్టం చేశారు.