మెట్రో ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణపై కేంద్రానికి విజ్ఞప్తి..
టిఓఆర్ ఖరారులో జాప్యంపై సీఎం ఆందోళన
హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-II విస్తరణకు తక్షణమే అనుమతులు మంజూరు చేయడంతో పాటు, మెట్రో ఫేజ్-Iను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిలకు ముఖ్యమంత్రి విడివిడిగా లేఖలు రాశారు.
ఇటీవల జూన్ 23, 24 తేదీలలో కేంద్ర మంత్రులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశాల నిర్ణయాలను గుర్తు చేస్తూ, ఈ ప్రక్రియలో జరుగుతున్న జాప్యంపై సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.
సమావేశ నిర్ణయాలను అమలు చేయాలి..
గత నెలలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశాల నిర్ణయాల ప్రకారం.. మెట్రో ఫేజ్-I ఆస్తుల విలువను నిర్ధారించడం , అధిక వడ్డీ రుణాల పునర్వ్యవస్థీకరణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ అయిన ఎస్‌బీఐ క్యాప్స్ కు అప్పగించాలని ఉమ్మడిగా అంగీకరించారు. అలాగే ఫేజ్-II విస్తరణకు అవసరమైన దీర్ఘకాలిక ఆర్థిక వనరుల సమీకరణపై సమగ్ర అధ్యయనం చేసే బాధ్యతను కూడా దీనికే అప్పగించాల్సి ఉంది.
అయితే, కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ను ఖరారు చేయకపోవడం, ఎస్‌బీఐ క్యాప్స్‌కు అధికారికంగా బాధ్యతలు అప్పగించడంలో జాప్యం చేయడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు.
జాప్యం జరిగితే ప్రాజెక్టు వ్యయం పెరిగే ప్రమాదం!
ఈ కాలయాపన వల్ల మెట్రో ఫేజ్-I నిర్వహణలో రోజువారీ ఇబ్బందులు, అనిశ్చితి ఎదురవుతున్నాయని ముఖ్యమంత్రి హెచ్చరించారు. అంతేకాకుండా, ఫేజ్-II డీపీఆర్‌ల ఆమోదం, నిధుల సమీకరణ ప్రక్రియలు ఆలస్యమై, ప్రాజెక్టు అమలు మరింత వాయిదా పడే అవకాశం ఉందన్నారు. దీనివల్ల భవిష్యత్తులో ప్రాజెక్టు వ్యయం గణనీయంగా పెరిగిపోతుందని లేఖలో పేర్కొన్నారు.
"హైదరాబాద్ భవిష్యత్ ప్రజా రవాణా అవసరాలకు అత్యంత కీలకమైన మెట్రో ఫేజ్-II విస్తరణ పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం కాకూడదు."అని రేవంత్ రెడ్డి అన్నారు.
కేంద్ర మంత్రుల వ్యక్తిగత జోక్యానికి విజ్ఞప్తి
ఈ అంశంలో కేంద్ర మంత్రులు ఇద్దరూ వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని, ఎస్‌బీఐ క్యాప్స్ నియామక ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తీసుకున్న నిర్ణయాలు వేగంగా అమలైతేనే.. మెట్రో ఫేజ్-I స్వాధీనం ప్రక్రియ పూర్తికావడంతో పాటు, మెట్రో ఫేజ్-II విస్తరణ పనులు ఎలాంటి అడ్డంకులు లేకుండా ముందుకు సాగుతాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.