బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ప్రత్యేక ప్రోత్సాహకాలు
ఆధునిక సాగు అధ్యయనానికి రైతులను మలేషియా పంపుతాం
కాళేశ్వరం నీళ్లు ఇవ్వకుండా రైతులను కాంగ్రెస్ ముంచుతోంది
బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయిల్‌పామ్ రైతులకు మరిన్ని ప్రోత్సాహకాలు అందించి, అండగా నిలుస్తామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హామీ ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వ్యవసాయ రంగంలో పంటల వైవిధ్యీకరణ (క్రాప్ డైవర్సిఫికేషన్) కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితాలు, రైతుల అనుభవాలు, వారి సమస్యలను ఈ సందర్భంగా కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగును విస్తరించాలన్నది మాజీ సీఎం కేసీఆర్ గారి లక్ష్యమని కేటీఆర్ గుర్తుచేశారు. మలేషియా, ఇండోనేషియా దేశాల తరహాలో ఇక్కడ సాగును పెంచడం ద్వారా వంటనూనెల దిగుమతులు తగ్గి, రైతులకు అధిక ఆదాయం లభిస్తుందన్నారు. వరితో పోలిస్తే ఆయిల్‌పామ్ ద్వారా మూడు రెట్లు ఎక్కువ ఆదాయం వస్తుందని వివరించారు. బీఆర్ఎస్ హయాంలో 1.5 లక్షల ఎకరాలుగా ఉన్న ఆయిల్‌పామ్ సాగు, ప్రస్తుతం 3 లక్షల ఎకరాలకు చేరిందని.. ప్రభుత్వ సహకారం ఉంటే ఇది 7 లక్షల ఎకరాలకు విస్తరిస్తుందని చెప్పారు. 2028లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, ఆ తర్వాత తెలంగాణను దేశంలోనే అత్యధిక ఆయిల్‌పామ్ పండించే రాష్ట్రంగా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఐటీ ఉద్యోగి సక్సెస్ స్టోరీ
ఈ సమావేశంలో ఐటీ ఉద్యోగం చేస్తూనే 7 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న 'అనిల్' అనే రైతు తన అనుభవాన్ని పంచుకున్నారు. నాలుగేళ్ల తర్వాత పంట దిగుబడి ప్రారంభమైందని, ప్రస్తుతం ఎకరాకు 4 నుండి 5 టన్నుల దిగుబడి వస్తోందని చెప్పారు. ఉద్యోగంలో జీతం వచ్చినట్లే ఈ పంట ద్వారా ప్రతి నెల స్థిరమైన ఆదాయం లభిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ పంటకు నీటి అవసరం తక్కువని, వాతావరణ మార్పులను తట్టుకుంటుందని ఇతర రైతులు తెలిపారు.
రైతుల సమస్యలు - కేటీఆర్ హామీలు
రైతులు కూలీల కొరత, యాంత్రీకరణ అవసరం, సెకండ్ డ్రిప్ సిస్టమ్ సాయం, విదేశీ పామాయిల్ దిగుమతుల వల్ల వస్తున్న నష్టాలను కేటీఆర్ దృష్టికి తెచ్చారు. కేంద్ర ప్రభుత్వం యాంటీ డంపింగ్ విధానాన్ని తెచ్చి దేశీయ రైతులను రక్షించాలని కోరారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే వీటికి పరిష్కారాలు చూపుతామన్నారు.
ట్రాక్టర్లు, స్లాషర్లు వంటి వ్యవసాయ యంత్రాల కొనుగోలుకు భారీ సబ్సిడీలు ఇస్తాం.రెండో దశ డ్రిప్ వ్యవస్థల ఏర్పాటుకు ప్రత్యేక ఆర్ధిక సహాయం అందిస్తాం.ఆధునిక సాగు పద్ధతులను నేర్చుకోవడానికి రైతులను మలేషియా కు అధ్యయన పర్యాటనలకు పంపుతాం.
కాంగ్రెస్ వైఖరిపై విమర్శలు
ఇదే సమయంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును సమర్థంగా వాడుకోవడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. మేడిగడ్డలో ఒక చిన్న భాగంలో సమస్య వస్తే.. మొత్తం ప్రాజెక్టునే పక్కన పెట్టేసి రైతుల పొట్ట కొడుతున్నారని మండిపడ్డారు. కన్నెపల్లి పంపు కేంద్రాన్ని తక్షణమే ప్రారంభించి, నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లను నింపాలని, ఎండిపోతున్న పంటలను కాపాడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.