🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 07 July 2026, 10:04 PM Posted by: MANA VISHWAM

మోదీకి ఇండోనేషియా అత్యున్నత పురస్కారం ‘బింటాంగ్ ఆదిపూర్ణ’

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇండోనేషియా ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'బింటాంగ్ ఆదిపూర్ణ'ను ప్రదానం చేసింది. ఈ అత్యున్నత గౌరవాన్ని అందించిన ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటోకు, ఆ దేశ ప్రజలకు మోదీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నట్లు తెలిపిన ప్రధాని, ఇది తనకు మాత్రమే కాకుండా 140 కోట్ల భారత ప్రజలందరికీ దక్కిన గౌరవంగా పేర్కొంటూ దేశానికి అంకితం చేశారు. భారత్–ఇండోనేషియా దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న చారిత్రక, సాంస్కృతిక స్నేహబంధాలకు, వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఈ అవార్డు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నట్లు మోదీ చెప్పారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వంతో పాటు వాణిజ్యం, రక్షణ, సముద్ర భద్రత రంగాల్లో రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయని, భవిష్యత్తులో ఈ ద్వైపాక్షిక సంబంధాలు మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటాయని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు.
🏠 Home