🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 08 July 2026, 09:36 PM Posted by: MANA VISHWAM

​ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన యాదగిరిగుట్ట నూతన పాలక మండలి

​యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నూతన పాలక మండలి సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా పాల్గొన్నారు. ఇటీవల నూతనంగా ఏర్పాటైన ఈ బోర్డు సభ్యులు ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
​ఈ సమావేశంలో దేవస్థానం బోర్డు చైర్మన్ ఎం. సత్యనారాయణ రెడ్డితో పాటు బోర్డు సభ్యులు—ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, కొణిదెల సురేఖ, విజయ రాజం, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, డాక్టర్ మల్లయ్య, స్వాతి కాంతమనేని,ఎం. రాఘవేందర్ రావు, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ పాల్గొన్నారు.
​ఈ సందర్భంగా యాదగిరిగుట్ట క్షేత్ర అభివృద్ధి, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై నూతన పాలక మండలికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేశారు.
🏠 Home