🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 08 July 2026, 10:47 PM Posted by: MANA VISHWAM

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వే శాఖ సూపరింటెండెంట్

మహబూబ్‌నగర్ జిల్లా సర్వే, భూ రికార్డుల కార్యాలయంలో గ్రామ మ్యాప్‌ సవరణల ఫైలును ముందుకు కదిపేందుకు రూ.15 వేలు లంచం తీసుకుంటూ సూపరింటెండెంట్ బొమ్మిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి బుధవారం ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. భూత్పూర్ మండలం కర్వెన గ్రామానికి చెందిన బాధితుడి నుంచి లంచం డిమాండ్ చేయడంతో, అతడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పక్కా వ్యూహంతో దాడి చేసి నిందితుడిని పట్టుకున్నారు. అక్రమ లబ్ధి కోసం లంచం తీసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలడంతో వెంకటేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేశామని, సొమ్మును స్వాధీనం చేసుకుని ఆయనను హైదరాబాద్ నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు.
🏠 Home