నెలలో కనిపించేది 3–4 రోజులే.. జీతం మాత్రం ఫుల్!
విధులకు డుమ్మా.. రోగులకు కష్టం.. అధికారులు మాత్రం మౌనం!
అటెండెన్స్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజీలు పరిశీలిస్తే అసలు నిజాలు బయటపడతాయన్న ఉద్యోగులు
వరంగల్ ప్రతినిధి (మన విశ్వం): పేద కార్మికులకు నాణ్యమైన వైద్యం అందించాల్సిన వరంగల్ ఈఎస్ఐ ఆసుపత్రిలో పరిపాలన గాడి తప్పిందనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. రోగులకు అండగా నిలవాల్సిన ఆసుపత్రి సూపరింటెండెంట్ గారే విధులకు ఎగనామం పెడుతున్నారనే విమర్శలు రోజురోజుకూ బలపడుతున్నాయి. ఆసుపత్రిలో నెలకు 30 రోజులు ఉండాల్సిన అధికారి... కేవలం మూడు లేదా నాలుగు రోజులు మాత్రమే వచ్చి సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని ఉద్యోగులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. మిగతా రోజుల్లో సార్ ఆచూకీ లేకపోయినా... జీతం మాత్రం ప్రతి నెలా ఎలాంటి ఆటంకం లేకుండా ఖాతాలో పడుతుండడం చర్చనీయాంశంగా మారింది.
సార్ ఎప్పుడు వస్తారో... ఎవరికీ తెలియదు!
ఈఎస్ఐ ఆసుపత్రిలో సూపరింటెండెంట్ గారి డ్యూటీ టైమింగ్స్ అనేవి సిబ్బందికే అంతుపట్టడం లేదని సమాచారం. ఏ రోజు వస్తారు? ఎంతసేపు ఉంటారు? ఎప్పుడు వెళ్లిపోతారు? అన్నది ఎవరికీ స్పష్టంగా తెలియని పరిస్థితి నెలకొంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారి ఇలా వ్యవహరిస్తున్నా... ప్రశ్నించే అధికారులు కనిపించకపోవడం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో ఆసుపత్రి పరిపాలన పూర్తిగా గాలికొదిలేసినట్లుగా మారిందని సిబ్బంది వాపోతున్నారు.
బయోమెట్రిక్ ఉంటే... హాజరు ఎక్కడ?
ప్రభుత్వ శాఖల్లో బయోమెట్రిక్ హాజరు విధానం అమల్లో ఉన్నా... ఈఎస్ఐ ఆసుపత్రిలో మాత్రం అది కేవలం పేరుకేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నెలకు కనీసం 25 రోజులు విధులు నిర్వహించాల్సిన అధికారి... కేవలం మూడు, నాలుగు రోజులు మాత్రమే హాజరవుతున్నారని సమాచారం. మరి మిగతా రోజుల్లో హాజరు ఎలా నమోదవుతోంది? జీతం ఎలా విడుదల అవుతోంది? అనే ప్రశ్నలకు సమాధానం దొరకడం లేదు. ఈ వ్యవహారంపై లోతైన విచారణ జరపాలనే డిమాండ్ పెరుగుతోంది.
రోగులు ఎదురుచూపుల్లో... పరిపాలన గాలిలో!
సూపరింటెండెంట్ అందుబాటులో లేకపోవడంతో ఆసుపత్రిలో అనేక పరిపాలనా నిర్ణయాలు ఆలస్యమవుతున్నాయని తెలుస్తోంది. చికిత్స కోసం వచ్చే కార్మికులు, పేద రోగులు ఇబ్బందులు పడుతున్నా... వారి సమస్యలను పట్టించుకునే పరిస్థితి లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కలెక్టర్ గారూ... ఒకసారి ఆకస్మిక తనిఖీ చేయండి!
వరంగల్ ఈఎస్ఐ ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితులపై జిల్లా కలెక్టర్ వెంటనే దృష్టి సారించాలని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, స్థానికులు కోరుతున్నారు. సూపరింటెండెంట్ బయోమెట్రిక్ హాజరు వివరాలు, సీసీటీవీ ఫుటేజీలు, డ్యూటీ రిజిస్టర్లు, జీతాల చెల్లింపు రికార్డులను సమగ్రంగా పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వారు అంటున్నారు. నిజంగా విధులకు గైర్హాజరవుతూ ప్రభుత్వ నిధులను పొందుతున్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుని, ఈఎస్ఐ ఆసుపత్రిలో బాధ్యతాయుతమైన పరిపాలనను పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు.