🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 10 July 2026, 11:25 AM Posted by: MANA VISHWAM

ఎగనామాల సూపరింటెండెంట్..!

వరంగల్ ఈఎస్ఐ ఆసుపత్రి సూపరింటెండెంట్ నెలకు కేవలం 3 నుండి 4 రోజులు మాత్రమే విధులకు హాజరవుతూ పూర్తి జీతం పొందుతున్నారనే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆయన విధులకు డుమ్మా కొడుతుండటంతో ఆసుపత్రి పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని, పేద రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిబ్బంది, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయోమెట్రిక్ విధానం ఉన్నప్పటికీ ఆయన హాజరు ఎలా నమోదవుతోంది, జీతం ఎలా విడుదలవుతోందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్పందించి, ఆసుపత్రి అటెండెన్స్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజీలను ఆకస్మిక తనిఖీ చేసి నిజానిజాలు తేల్చాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
🏠 Home