నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశం
బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది
పోక్సో కేసు కక్షతోనే ఆరుగురిని చంపిన ఉన్మాది రాజ్‌కుమార్
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన ఆరుగురి సామూహిక హత్యల ఘటనపై రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాజస్థాన్ పర్యటనలో ఉన్న మంత్రి, ఈ ఘోర ఉదంతం తెలిసిన వెంటనే స్పందించారు. సంబంధిత పోలీసు కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. నిందితుడిని వెంటనే అరెస్టు చేసి చట్టప్రకారం అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసి, అన్ని కోణాల్లో సమగ్రంగా విచారించాలని సూచించారు. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధితులకు తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు మహిళా, శిశు సంక్షేమ శాఖ తరఫున అవసరమైన మానసిక, సామాజిక సహాయాన్ని కూడా కల్పించాలని అధికారులను ఆదేశించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, నేరస్థులు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని స్పష్టం చేశారు.