🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 13 July 2026, 04:29 PM Posted by: MANA VISHWAM

ఆరుగురిని చంపిన హంతకుడు రాజ్‌కుమార్ మృతి

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు మొత్తం ఆరుగురిని అతి దారుణంగా కత్తితో నరికి చంపిన కేసులో ప్రధాన నిందితుడు జెల్లా రాజ్‌కుమార్ (32) శవమై తేలాడు. సోమవారం కొత్తూరు సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో అతని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
​స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మృతుడు ఆరుగురిని పొట్టనబెట్టుకున్న రాజ్‌కుమార్ అని నిర్ధారించారు. లొంగిపోవడం ఇష్టం లేక, పోలీసుల వేట తీవ్రం కావడంతో అతడు విషం తాగి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ప్రాథమికంగా భావిస్తున్నారు.

​పోక్సో కక్షతోనే ఘాతుకం..

దైవాలగూడకు చెందిన రాజ్‌కుమార్‌పై గతంలో ఓ మైనర్ బాలికను వేధించినందుకు పోక్సో (POCSO) కేసు నమోదైంది. ఈ కక్షతోనే సదరు మైనర్ బాలిక, ఆమె తల్లి లక్ష్మి, నాయనమ్మ రుక్మిమ్మలను రాజ్‌కుమార్ దారుణంగా హత్య చేశాడు. ఆ తర్వాత తన గుట్టు రట్టవుతుందనే భయంతో, తనను అడ్డుకుంటారనే కోపంతో కట్టుకున్న భార్య, ఇద్దరు అమాయక కుమారులను కూడా కత్తితో నరికి చంపి పరారయ్యాడు.

​ఒకే రోజు ఆరుగురిని బలితీసుకున్న ఈ నరరూప రాక్షసుడి అంతంపై స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
🏠 Home