🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 13 July 2026, 10:08 PM Posted by: MANA VISHWAM

సీఎం రేవంత్‌పై మారేడుపల్లి పీఎస్‌లో ఫిర్యాదు

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావులపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ నాయకులు మండిపడ్డారు. సీఎం వ్యాఖ్యలు హింసను ప్రేరేపించేలా, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ సోమవారం మారేడుపల్లి పోలీస్‌ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
​బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని బీఆర్‌ఎస్‌ నాయకులు పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేస్తూ.. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌) నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిబంధనల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు నేతలు వెల్లడించారు.
🏠 Home