వరంగల్ ఫోర్ట్ రోడ్ లోని బొడ్రాయి సన్నిధానంలో అమావాస్యను పురస్కరించుకుని సోమవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన భక్తులకు కమిటీ సభ్యులు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.
దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు
గత 20 నెలలుగా విరామం లేకుండా ప్రతి అమావాస్యకు ఈ అన్నదాన కార్యక్రమం విజయవంతం కావడానికి నిరంతరం సహాయ సహకారాలు అందిస్తున్న దాతలకు కమిటీ సభ్యులు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నిరుపేదల ఆకలి తీరుస్తున్న దాతల సేవాభావం అభినందనీయమని, ఆ భగవంతుని ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.
ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ అన్నదాన కార్యక్రమంలో వడ్డేపల్లి భరత్, గొర్రె చెరాలు, అప్రధపు సారంగపాణి, మంతిని చక్రధర్, పొన్నం కుమారస్వామి, కామ్మ రామ్మోహన్, తోట వీరభద్రం, కొత్తపల్లి శ్రీను, గుడికదుల ప్రగత్, గుణల మధు, గాటు శివాజీ, సిగరబోయిన నగరాజుతో పాటు పలువురు భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.