కేంద్ర మంత్రులతో సమావేశాలు.. సాగునీటి ప్రాజెక్టులు, పర్యావరణ అనుమతులపై చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఢిల్లీలో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రధాన అంశాలపై కేంద్ర ప్రభుత్వ సహకారం కోరుతూ పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు.
ఈ సందర్భంగా కేంద్ర జలశక్తి మంత్రి సీ ఆర్ పాటిల్ తో సీఎం సమావేశమై రాష్ట్రంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు, వాటికి కేంద్రం నుంచి అందాల్సిన ఆర్థిక సహాయం, జలవనరుల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. తెలంగాణకు సంబంధించిన కీలక నీటిపారుదల ప్రతిపాదనలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం.
అనంతరం కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ తో భేటీ కానున్న సీఎం, రాష్ట్రంలోని పలు అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన పర్యావరణ, అటవీ అనుమతుల మంజూరును వేగవంతం చేయాలని కోరనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనలపై కూడా సమగ్రంగా చర్చించే అవకాశం ఉంది.
రాష్ట్రంలో సాగుతున్న కీలక సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, కేంద్ర సహకారంతో చేపట్టాల్సిన కొత్త ప్రతిపాదనలు, పెండింగ్ అనుమతుల మంజూరు వంటి అంశాలు ఈ సమావేశాల్లో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి.