రూ.470 కోట్ల రుణంపై సమగ్ర దర్యాప్తు అవసరం
వారం రోజుల్లో రూ.190 కోట్లు ఎలా చెల్లించారు?
మంచిర్యాలలో మాఫియా రాజ్యం నడుస్తోందని ఆరోపణ
విజిలెన్స్, ఏసీబీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్న
బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్
హైదరాబాద్, ఆగస్టు 7 (మన విశ్వం): మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ఆస్తులు, ఆయనకు సంబంధించిన కంపెనీల ఆర్థిక లావాదేవీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమగ్ర విచారణ జరపాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. రూ.470 కోట్ల రుణం తీసుకుని వారం రోజుల్లోనే రూ.190 కోట్లు ఎలా చెల్లించగలిగారో వెల్లడించాలని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఎందుకు దృష్టిసారించడం లేదని నిలదీశారు.
మంచిర్యాలలో మాఫియా రాజ్యం నడుస్తోందని ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ఐటీ పార్కు పేరుతో పేదల భూములను తీసుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారని, గోదావరి నుంచి అక్రమ ఇసుక రవాణా, మట్టి దందాలు సాగుతున్నాయని ఆరోపించారు. పేదల ఇళ్లను అన్యాయంగా కూల్చివేస్తున్నా జిల్లా యంత్రాంగం, పోలీసు, మైనింగ్, రెవెన్యూ అధికారులు స్పందించడం లేదన్నారు. చెరువులు కబ్జాలకు గురవుతున్నాయని పేర్కొంటూ హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
‘రూ.140 కోట్లు ఎలా వచ్చాయి?’
ఎమ్మెల్యేకు సంబంధించినవిగా పేర్కొంటున్న కొన్ని కంపెనీలు నిరర్థక ఆస్తులుగా (ఎన్‌పీఏ) మారిన పరిస్థితుల్లో ముంబయికి చెందిన ఓ సంస్థ నుంచి రూ.140 కోట్లు ఎలా వచ్చాయో తేల్చాలని ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. రూ.10 లక్షల విలువ మాత్రమే ఉందని తాను పేర్కొంటున్న ఓ కంపెనీకి రూ.140 కోట్ల రుణం ఎలా లభించిందో విచారించాలన్నారు. సాధారణ ప్రజలకు రుణాలిచ్చేటప్పుడు సిబిల్ స్కోర్, ఆస్తులు, ష్యూరిటీలు పరిశీలించే బ్యాంకులు ఈ వ్యవహారంలో ఏ ప్రాతిపదికన రుణాలు ఇచ్చాయో వెల్లడించాలని కోరారు.
వారం వ్యవధిలో రూ.190 కోట్ల చెల్లింపులు ఎలా జరిగాయన్న అంశంపై విజిలెన్స్, ఏసీబీ విచారణ చేపట్టాలని, అవసరమైతే మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ లోతైన దర్యాప్తు జరపాలని ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. తాను లేవనెత్తిన ఆర్థిక లావాదేవీలు, ఆస్తులకు సంబంధించిన అంశాలపై సంబంధిత సంస్థలు నిజానిజాలను నిగ్గుతేల్చాలని కోరారు.