కమలాపూర్‌లో 394 డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీ
ఇందిరమ్మ ఇళ్లకు రూ.5 లక్షల చొప్పున సాయంఅర్హతే ప్రామాణికం: మంత్రి పొంగులేటి
హనుమకొండ, ఆగస్టు 10 (మన విశ్వం): అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతింటిని సమకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో 394 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్‌రూం ఇళ్లను పంపిణీ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. గతంలో అసంపూర్తిగా నిలిచిన సుమారు 35 వేల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తున్నట్లు చెప్పారు. ఇందిరమ్మ గృహ పథకంలో తొలి విడతలో 4.5 లక్షల ఇళ్లు, రెండో విడతలో మరో 2.5 లక్షల ఇళ్ల మంజూరు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. తదుపరి విడతల్లో మరిన్ని ఇళ్లను మంజూరు చేస్తామని వెల్లడించారు.
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఒక్కో లబ్ధిదారునికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నామని, నిర్మాణ దశలకు అనుగుణంగా నిధులను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. కులం, మతం, రాజకీయ అనుబంధాలతో సంబంధం లేకుండా అర్హతే ప్రామాణికంగా ఇళ్లను మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.
ఇళ్లతోపాటు తాగునీరు, రహదారులు, విద్యుత్ వంటి మౌలిక వసతులను కల్పించి కాలనీలను అభివృద్ధి చేస్తామన్నారు. రేషన్‌కార్డులు, సన్నబియ్యం, పేద బాలికల వివాహాలకు ఆర్థిక సాయం, విద్యార్థుల డైట్, కాస్మెటిక్ ఛార్జీల పెంపు వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వివరించారు.
కార్యక్రమానికి ముందు గూడూరులోని డబుల్ బెడ్‌రూం ఇళ్లను మంత్రులు పరిశీలించారు. లబ్ధిదారుల గృహప్రవేశాల్లో పాల్గొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు అందే వరకు ఇందిరమ్మ గృహ పథకం కొనసాగుతుందని పొంగులేటి పేర్కొన్నారు.