🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 11 August 2026, 08:35 AM Posted by: MANA VISHWAM

మృతురాలి కుటుంబానికి కాంగ్రెస్‌ నేతల పరామర్శ

గ్రేటర్‌ వరంగల్‌ 17వ డివిజన్‌ ఆదర్శనగర్‌లో ఇటీవల మృతి చెందిన ఎండీ సల్మా కుటుంబ సభ్యులను కాంగ్రెస్‌ నాయకులు పరామర్శించారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి సూచన మేరకు వరంగల్‌ జిల్లా యూత్‌ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి సింగారపు రాజేష్‌ ఆధ్వర్యంలో నాయకులు బాధిత కుటుంబాన్ని కలిసి సానుభూతి తెలిపారు. కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేశారు.
కార్యక్రమంలో రావుల యాదగిరి, గుండెకారి రవి, ఎండీ షబ్బీర్‌, నరసింహారెడ్డి, షేక్‌ దస్తగిరి, మాజీ ఎంపీటీసీ ఎండీ షమీమా బేగం, మునుపటి రవి, కడిదెల నాగరాజు, యూత్‌ కాంగ్రెస్‌ మండల ప్రధాన కార్యదర్శి కడిదెల ప్రణయ్‌, గుండెకారి వినయ్‌ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home