🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 11 August 2026, 08:38 AM Posted by: MANA VISHWAM

రాజయ్య సేవలకు జాతీయ గుర్తింపు

వరంగల్ జిల్లా గొర్రెకుంటకు చెందిన విద్యావేత్త, తెలంగాణ ఉద్యమకారుడు, సంఘ సేవకుడు ఎలగొండ రాజయ్య ‘సేవా రత్న-నేషనల్ అవార్డు-2026’కు ఎంపికయ్యారు. పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు చేయూతనందిస్తున్నందుకు ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు బహుజన సాహిత్య అకాడమీ (బీఎస్‌ఏ) జాతీయ అధ్యక్షుడు, అవార్డు ఎంపిక కమిటీ ఛైర్మన్ నల్లా రాధాకృష్ణ తెలిపారు.
హైదరాబాద్‌లోని బీఎస్‌ఏ జాతీయ కార్యాలయంలో రాజయ్యకు అవార్డు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ నెల 16న హైదరాబాద్‌లో నిర్వహించే అకాడమీ తెలంగాణ రాష్ట్ర సదస్సులో పురస్కారం ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో టేక్ రాజశేఖర్, కనుకుంట్ల విజయ్‌కుమార్, బిచ్చగారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home