తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ -2026 ను జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రతిష్ఠను చాటేలా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు తరలిరానున్న నేపథ్యంలో మౌలిక వసతులు, వసతి సౌకర్యాలు, పోటీల నిర్వహణలో ఎక్కడా లోటు లేకుండా ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. డిసెంబరులో పోటీల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.
ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో మంగళవారం క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏర్పాట్లపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్షించారు. హైదరాబాద్‌లోని స్టేడియంల ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి, కేవలం ఈ పోటీల కోసమే కాకుండా భవిష్యత్తులోనూ ఉపయోగపడేలా వాటిని శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన నిధులు సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
20 క్రీడలు.. వేదికలపై ముందే కసరత్తు
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో భాగంగా 20 రకాల క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నందున ఒక్కో క్రీడకు అనువైన వేదికలను ముందుగానే గుర్తించాలని సీఎం సూచించారు. ఆయా ప్రదేశాల్లో అవసరమైన సదుపాయాలను కల్పించడంతో పాటు క్రీడాకారులు, కోచ్‌లు, అధికారులు, అతిథులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. మౌలిక వసతులు, పోటీల నిర్వహణ, అతిథుల సౌకర్యాలకు సంబంధించి అధికారులకు పని విభజన చేసి బాధ్యతలు అప్పగించాలని చెప్పారు.
ప్రారంభం.. ముగింపు వేడుకలు ప్రత్యేకంగా
పోటీల ప్రారంభ, ముగింపు వేడుకలను ఆకట్టుకునేలా నిర్వహించేందుకు ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్య అతిథులతో పాటు ప్రముఖ క్రీడాకారులు, సినీ ప్రముఖులను భాగస్వాములను చేసేందుకు కసరత్తు చేయాలన్నారు. తెలంగాణకు చెందిన అర్జున అవార్డు గ్రహీతలు, తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు సభ్యులు, ఒలింపిక్ అసోసియేషన్, జాతీయ స్థాయి క్రీడా ప్రతినిధులను కూడా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని సూచించారు." క్రీడా స్ఫూర్తిని ప్రతిబింభించేలా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహణ ఉండాలి. దేశ వ్యాప్తంగా తెలంగాణ కు మంచి పేరు తీసుకోచ్చేలా ఏర్పాట్లు చేయాలి " అని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.
సమీక్షలో ప్రభుత్వ సలహాదారు కె.రామకృష్ణారావు, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (SATG) ఛైర్మన్ శివసేనారెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, SATG ఎండీ ఎ.సోనీబాల దేవి తదితరులు పాల్గొన్నారు.