🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 19 August 2026, 09:55 AM Posted by: MANA VISHWAM

గ్రూపు రాజకీయాలు మానుకోండి: రాజాసింగ్‌

ఢిల్లీకి ఫిర్యాదులతో పార్టీకి నష్టం

అందుకే జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నేతలకు చోటు దక్కలేదు

ఇప్పటికైనా రాష్ట్ర నేతలు తీరు మార్చుకోవాలని హితవు

తెలంగాణ బీజేపీలో తరచూ గ్రూపు రాజకీయాలు సాగడం, నేతలు ఒకరిపై మరొకరు ఢిల్లీకి ఫిర్యాదులు చేసుకోవడం పార్టీకి నష్టం చేస్తోందని ఎమ్మెల్యే రాజాసింగ్‌ వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల కారణంగానే బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నేతలకు చోటు దక్కలేదని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించాల్సిన నేతలు అంతర్గత విభేదాలతో అధిష్ఠానం వద్దకు వెళ్లడం సరికాదన్నారు. ఇప్పటికైనా తెలంగాణ బీజేపీ నేతలు తమ తీరు మార్చుకోవాలని సూచించారు. గ్రూపు రాజకీయాలను పక్కనపెట్టి పార్టీ కోసం ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని రాజాసింగ్‌ పేర్కొన్నారు.
🏠 Home