నర్సంపేట రూరల్, నెక్కొండ సీఐలు వీ.ఆర్‌కు
కొత్తగా జే.శంకర్‌రావు, కే.ఫణిందర్‌ల నియామకం
పెద్ది విగ్రహం వివాదం నేపథ్యంలోనేనా?.. నర్సంపేట లో జోరుగా చర్చ
నర్సంపేట, ఆగస్టు 19 (మన విశ్వం): నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం ఏర్పాటు, తొలగింపు వ్యవహారం రాజకీయంగా వేడి పుట్టిస్తున్న వేళ.. ఇద్దరు సీఐల బదిలీ చర్చనీయాంశమైంది. నర్సంపేట రూరల్ సీఐ సాయిరమణ, నెక్కొండ సీఐ శ్రీనివాస్‌లను వీ.ఆర్‌కు అటాచ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. వారి స్థానాల్లో జే.శంకర్‌రావు, కే.ఫణిందర్‌లను నియమించినట్లు తెలిసింది.
విగ్రహం చుట్టూ ఉద్రిక్తత
పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం ఏర్పాటు కోసం నర్సంపేటలో నిర్మించిన గద్దెను అనుమతులు లేవన్న కారణంతో మున్సిపల్ అధికారులు తొలగించడంతో వివాదం మొదలైంది. దీనిపై బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనలు, రాస్తారోకోలు చేపట్టాయి. అనంతరం అదే ప్రాంతంలో తిరిగి గద్దె నిర్మించి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.
ఇప్పుడే బదిలీలు.. అందుకే చర్చ
విగ్రహం వ్యవహారంపై రాజకీయ రగడ కొనసాగుతున్న సమయంలోనే ఇద్దరు సీఐలను వీ.ఆర్‌కు పంపడం పోలీసు వర్గాల్లో చర్చకు దారితీసింది. శాంతిభద్రతల నిర్వహణకు సంబంధించిన పరిణామాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారా? లేక సాధారణ పరిపాలనా కారణాలతో బదిలీ చేశారా? అన్నది ఆసక్తికరంగా మారింది. బదిలీలకు విగ్రహ వివాదంతో సంబంధం ఉందా లేదా అనే అంశంపై ప్రజలు జోరుగా చర్చించుకుంటున్నారు.