పాలిటెక్నిక్‌లను బలోపేతం చేసి విద్యార్థులకు నైపుణ్య శిక్షణతోపాటు ఉపాధి అవకాశాలను పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. జీవో 97 ద్వారా వాటిని ఉపాధి, శిక్షణ కమిషనరేట్ పరిధిలోకి తీసుకురావడం కేవలం పరిపాలనా పునర్వ్యవస్థీకరణేనని తెలిపారు.
ఏఐసీటీఈ గుర్తింపు పొందిన మూడేళ్ల డిప్లొమా కోర్సులు, ఫీజులు, పరీక్షల విధానంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు. టీజీఈసెట్ ద్వారా ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో ప్రవేశించే అవకాశమూ యథాతథంగా ఉంటుందని చెప్పారు. ఉద్యోగుల పోస్టులు, కేడర్, వేతనాలు, సీనియారిటీ, పదోన్నతులు సహా అన్ని హక్కులకు రక్షణ ఉంటుందని హామీ ఇచ్చారు.
టాటా టెక్నాలజీస్‌తో రూ.2,300 కోట్ల భాగస్వామ్యంతోపాటు 200కుపైగా పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు. ప్రతి పాలిటెక్నిక్‌లో నియామక విభాగాన్ని ఏర్పాటు చేసి క్యాంపస్ ప్లేస్‌మెంట్లను పెంచుతామన్నారు. పాలిటెక్నిక్‌ల భూములు, భవనాలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయబోమని మంత్రి స్పష్టం చేశారు.