ప్రజాస్వామ్యం బలంగా నిలవాలంటే పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. పాలకులను ప్రశ్నించే స్వేచ్ఛ మీడియాకు ఉండాలని.. విమర్శలను స్వీకరించే ధైర్యం ప్రభుత్వాలకూ అవసరమన్నారు. ప్రజల గొంతుకగా మీడియా ఎంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యం అంత పటిష్ఠంగా ఉంటుందని చెప్పారు.
దేశంలోని పలు రాష్ట్రాల ప్రెస్‌క్లబ్‌ల ప్రతినిధులతో ఏర్పాటైన ‘ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్’ ను హైదరాబాద్‌లో భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఎనిమిది ప్రెస్‌క్లబ్‌ల ప్రతినిధులు భాగస్వాములైన ఈ వేదిక జర్నలిస్టుల ఐక్యత, సంక్షేమం, పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు తోడ్పడాలని ఆకాంక్షించారు.
స్వాతంత్ర్య ఉద్యమం నుంచి ప్రజా చైతన్యం వరకు జర్నలిజం కీలక పాత్ర పోషించిందని భట్టి గుర్తుచేశారు. మహాత్మా గాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, లోకమాన్య తిలక్ వంటి నేతలు పత్రికలను సామాజిక, రాజకీయ మార్పునకు సాధనాలుగా మలిచారని పేర్కొన్నారు.
సమాచారం అపారం.. నమ్మకమే ప్రధానం
ప్రస్తుత కాలంలో సమాచారానికి కొరత లేదని.. విశ్వసనీయ సమాచారమే సవాలుగా మారిందని భట్టి వ్యాఖ్యానించారు. కృత్రిమ మేధ, వాయిస్ క్లోనింగ్ వంటి సాంకేతికతలతో తప్పుడు సమాచారం వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వాస్తవాలను నిర్ధారించి ప్రజలకు అందించాల్సిన బాధ్యత మీడియాపై మరింత పెరిగిందన్నారు. ' విశ్వసనీయతే జర్నలిస్టుకు అత్యంత విలువైన ఆస్తి ' అని పేర్కొన్నారు.
గ్రామీణ జర్నలిస్టులే ‘ఎర్లీ వార్నింగ్ సిస్టమ్’
జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే జర్నలిస్టులు క్షేత్రస్థాయి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నారని భట్టి ప్రశంసించారు. వారు ప్రభుత్వానికి ‘ముందస్తు హెచ్చరిక వ్యవస్థ’ లా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. జర్నలిస్టుల భద్రత, గౌరవం, ఉద్యోగ పరిస్థితులు, సంక్షేమంతో పాటు వృత్తి ప్రమాణాల పరిరక్షణపై సమాఖ్య ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు.
తెలంగాణ గడ్డకు స్వేచ్ఛగా మాట్లాడటం, ప్రశ్నించడం సహజ లక్షణమని భట్టి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జర్నలిస్టుల ఐక్యతకు, పత్రికా స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు ' ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ ' బలమైన వేదికగా ఎదగాలని ఆకాంక్షించారు.