🏠 manavishwam.com
Watermark
Newspaper Logo
Date of Publish: 24 August 2026, 10:28 PM Posted by: MANA VISHWAM

జీవో 97 పై ఆరుగురితో కమిటీ

పాలిటెక్నిక్‌ కళాశాలలను స్కిల్‌ యూనివర్సిటీలో విలీనం చేసేందుకు జారీ చేసిన జీవో 97పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విలీనానికి సంబంధించిన అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ఆరుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది.
కమిటీకి కె.కేశవరావును చైర్మన్‌గా నియమించింది. ప్రొఫెసర్‌ కోదండరామ్‌, శాంతా సిన్హా, నవీన్‌ మిట్టల్‌, శక్తి శాఖ కార్యదర్శి, సాంకేతిక విద్య కమిషనర్‌లను సభ్యులుగా నియమించింది.
పాలిటెక్నిక్‌ల విలీనానికి సంబంధించిన అంశాలు, సాంకేతిక విద్యపై దాని ప్రభావం తదితర విషయాలను కమిటీ పరిశీలించి ప్రభుత్వానికి సిఫారసులు చేయనుంది. 30రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం గడువు విధించింది. కమిటీ సిఫారసుల ఆధారంగా జీవో 97పై తదుపరి నిర్ణయం తీసుకోనుంది.
🏠 Home