తెలంగాణ జీవనాడి సింగరేణిని అంతర్జాతీయ స్థాయి సంస్థగా తీర్చిదిద్దడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన సంస్థను కాపాడుకుంటూనే.. భవిష్యత్ తరాలకు లాభదాయకంగా అందించేలా విస్తరణ ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో సింగరేణిని కేవలం బొగ్గు ఉత్పత్తికే పరిమితం చేయకుండా వ్యాపార విస్తరణపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. కాపర్, గ్రాఫైట్, లిథియం, కోబాల్ట్, బంగారం వంటి కీలక ఖనిజాల మైనింగ్‌లోకి అడుగుపెడుతున్నట్లు చెప్పారు.
బొగ్గు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు నైని, తాడిచర్ల-2, మణుగూరు డిప్‌సైడ్-2 వంటి కీలక బ్లాక్‌లను సాధించామని పేర్కొన్నారు. కర్ణాటకలో బంగారు గని వేలంలో విజయం సాధించడం సింగరేణి విస్తరణలో మరో మైలురాయిగా అభివర్ణించారు.
సంప్రదాయ బొగ్గు రంగంతో పాటు కొత్త ఖనిజ వనరుల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటూ సంస్థకు స్థిరమైన ఆదాయ మార్గాలను సృష్టిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణిని ఎన్‌టీపీసీ స్థాయిలో దేశంలోనే అత్యుత్తమ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటిగా నిలబెట్టి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకొస్తామని స్పష్టం చేశారు.