హైదరాబాద్, ఆగస్టు 30 (మన విశ్వం): గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు మల్కాజిగిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై జనసేన గురిపెట్టింది. మూడు కార్పొరేషన్లలో బలంగా బరిలోకి దిగాలని నిర్ణయించింది. ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లోని జనసేన తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జీహెచ్‌ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల పరిధి నేతలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాళ్లూరి రామ్ మాట్లాడుతూ.. ఎన్నికల పోరుకు పార్టీ శ్రేణులు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలన్నారు. జనసేన చేపడుతున్న కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లడంతో పాటు స్థానిక సమస్యలపై ప్రజల పక్షాన నిలవాలని సూచించారు.
పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జి నేమూరి శంకర్‌గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన బలోపేతానికి కృషి చేసిన వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే నేతలు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేయాలని సూచించారు.
ప్రధాన కార్యదర్శి సాగర్ ఆర్.కె. నాయుడు మాట్లాడుతూ.. ఈ కార్పొరేషన్ ఎన్నికలు తెలంగాణ రాజకీయ భవిష్యత్తుకు దిక్సూచిగా నిలుస్తాయన్నారు. ఇక్కడ వచ్చే ఫలితాలు రాష్ట్రంలో భవిష్యత్తు రాజకీయ పరిణామాలపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.
సమావేశంలో రాష్ట్ర నాయకులు రాధారం రాజలింగం, మచ్చ సుధాకర్, ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్, గడల శ్రీనివాస్, అల్లాడి తనీష్, అధికార ప్రతినిధులు ప్రేమ్‌గాంధీ, హైందవి రెడ్డి, కావ్య, నిహారిక, నివితతో పాటు మూడు కార్పొరేషన్ల పరిధిలోని నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు పాల్గొన్నారు.