హైదరాబాద్, సెప్టెంబర్ 2 (మన విశ్వం): ‘‘కేసీఆర్‌ను రాజీనామా చేయమంటున్నావు.. ఆయనకు రాజీనామాలు కొత్త కాదు. తెలంగాణ కోసం కేసీఆర్ రాజీనామా చేస్తే ఢిల్లీనే దిగివచ్చింది. మీ నాయకురాలు సోనియాగాంధీనే గజగజ వణికింది. ఇప్పుడు కేసీఆర్ రాజీనామా చేస్తే తట్టుకునే శక్తి నీకుందా రేవంత్‌రెడ్డి?’’ అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ రూపొందించిన ఛార్జిషీట్‌ను విడుదల చేసిన అనంతరం కేటీఆర్ మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ రాజీనామా చేయాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన ఘాటుగా స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో పదవులకు రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చిన చరిత్ర కేసీఆర్‌దని పేర్కొన్నారు. ‘‘కేసీఆర్‌కు పదవులు ముఖ్యం కాదు.. తెలంగాణ కోసం ఎన్నిసార్లయినా పదవులను వదులుకున్న నాయకుడు. ఆయన రాజీనామా శక్తి ఏమిటో కాంగ్రెస్‌కే బాగా తెలుసు’’ అని వ్యాఖ్యానించారు.
‘అసమర్థత ప్రో మ్యాక్స్.. అవినీతి అల్ట్రా మ్యాక్స్’
కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు." అసమర్ధ ప్రో మ్యాక్స్.. అవినీతి అల్ట్రా మ్యాక్స్" అంటూ ప్రభుత్వ పనితీరును ఎద్దేవా చేశారు. రాష్ట్ర సంపద విషయంలో ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య ఆధిపత్య పోరు సాగుతోందని ఆరోపించారు. ‘‘ఎంగిలి విస్తరాకుల దగ్గర కుక్కలు కొట్టుకున్నట్లు రాష్ట్ర సంపాదన కోసం ముఖ్యమంత్రి, మంత్రులు తన్నుకున్నారు’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘‘ఇప్పుడున్నది అచ్చ కాంగ్రెస్ కాదు.. పచ్చ కాంగ్రెస్ కాదు.. లుచ్చ కాంగ్రెస్’’ అంటూ కేటీఆర్ ధ్వజమెత్తారు. వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కంటే అవినీతి, అరాచకమే ఎక్కువైందని ఆరోపించారు.
‘జీవో 97పై అసెంబ్లీలో నిలదీస్తాం’
జీవో 97 విషయంలోనూ ప్రభుత్వంపై కేటీఆర్ మండిపడ్డారు. విలువైన భూములపై కన్నేసి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల సమస్యలను శాసనసభలో లేవనెత్తి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని నిలదీస్తామని ప్రకటించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని కేటీఆర్ ఆరోపించారు. మంత్రుల కుమారులు దౌర్జన్యాలకు పాల్పడినా, రాజకీయ నేతల కుటుంబ సభ్యులపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కంటోన్మెంట్‌లోని మిలిటరీ స్థావరంలోకి చొరబడి తుపాకులు ఎత్తుకెళ్లే పరిస్థితులు రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.
‘‘ఇంతకంటే హీనమైన ప్రభుత్వం.. ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితి మరొకటి లేదు’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. యువతను తక్కువ అంచనా వేయొద్దని హెచ్చరిస్తూ.. ‘‘జెన్-జీతో పెట్టుకుంటే మోదీకే చెమటలు పట్టాయి.. రేవంత్‌రెడ్డి ఎంత?’’ అంటూ వ్యాఖ్యానించారు.