హైదరాబాద్, సెప్టెంబర్ 8 (మన విశ్వం): రాష్ట్రంలో టెట్ అర్హత సాధించని ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించింది. స్పెషల్ టీజీటెట్–ఇన్ సర్వీస్ టీచర్స్–2026 పరీక్షలు మంగళ, బుధవారాల్లో (సెప్టెంబర్ 8, 9) జరగనున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 41 పరీక్షా కేంద్రాల్లో మూడు సెషన్లలో పరీక్షలను నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. మొత్తం 24,986 మంది ఉపాధ్యాయులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో పేపర్–1కు 5,964 మంది, పేపర్–2కు 19,022 మంది ఉన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఉపాధ్యాయులకు టెట్ అర్హత తప్పనిసరిగా మారిన నేపథ్యంలో 2025 సెప్టెంబర్ 1 నాటికి రాష్ట్రంలో సుమారు 66 వేల మంది ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణత సాధించలేదు. అనంతరం 2026 జనవరి, జూన్లో నిర్వహించిన రెండు రెగ్యులర్ టీజీటెట్ల ద్వారా సుమారు 38 వేల మంది అర్హత సాధించారు. ఇంకా దాదాపు 28 వేల మంది టెట్ అర్హత పొందాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉపాధ్యాయులకు మరో అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏటా నిర్వహించే రెండు రెగ్యులర్ టీజీటెట్లకు అదనంగా ఇన్-సర్వీస్ టీచర్ల కోసం రెండు ప్రత్యేక టెట్లు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం ఆదేశాల మేరకు పాఠశాల విద్యాశాఖ జూలై 21న స్పెషల్ టీజీటెట్–2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. అందులో భాగంగానే తొలి ప్రత్యేక పరీక్షకు 24,986 మంది ఉపాధ్యాయులు సిద్ధమయ్యారు.