నిబంధనలకు విరుద్ధంగా విక్రయిస్తున్నారంటూ ఆరోపణలు
వివరాలు తెలుసుకోకుండానే మందులు ఇస్తున్నారని స్థానికుల ఆందోళన
నల్లబెల్లిలో పురుగుమందు సేవించి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ములుగు జిల్లా ఆసుపత్రిలో చికిత్స ఫిర్యాదు వస్తే చట్టపరమైన చర్యలు: ఏవో రజిత
నల్లబెల్లి, సెప్టెంబర్ 25 (మన విశ్వం): నల్లబెల్లి మండలంలో పురుగుమందుల విక్రయాల్లో నిబంధనలు గాలికొదిలేస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కొనుగోలుదారుడి వివరాలు, వ్యవసాయ అవసరం తదితర అంశాలను నిర్ధారించకుండానే కొన్ని దుకాణాల్లో మందులు విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. క్షణికావేశంలో ఆత్మహత్యకు యత్నించే వారికి ఇవి సులభంగా అందుబాటులోకి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా నుంచి వచ్చి నల్లబెల్లి మండల కేంద్రంలో హోటల్ నిర్వహిస్తున్న షేక్ అమీర్ పాషా గురువారం ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆయన మండల కేంద్రంలోని ఓ ఎరువుల దుకాణంలో ‘హైడ్రా’ పేరుతో ఉన్న బయో మందును కొనుగోలు చేసి సేవించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అస్వస్థతకు గురైన అమీర్ పాషాను కుటుంబ సభ్యులు ములుగు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.
ఈ ఘటనతో పురుగుమందుల విక్రయాలపై పర్యవేక్షణ అంశం మరోసారి చర్చకు వచ్చింది. కొనుగోలుదారుల వివరాలు తెలుసుకోకుండా ప్రమాదకర మందులు విక్రయిస్తే అనర్థాలకు దారితీసే అవకాశం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. మండలంలో నిబంధనల అమలును అధికారులు తనిఖీ చేసి, ఉల్లంఘనలు తేలితే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఈ వ్యవహారంపై ఏవో బన్న రజితను వివరణ కోరగా, ఆధారాలు, అవసరమైన వివరాలు లేకుండా పురుగుమందుల విక్రయాలు చేపట్టకూడదని స్పష్టం చేశారు. బాధితులు ఫిర్యాదు చేస్తే నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. దుకాణంపై వచ్చిన ఆరోపణలు మాత్రం అధికారిక విచారణలో నిర్ధారణ కావాల్సి ఉంది.