ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే సైకిల్ తొక్కాలి: రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికీ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైనది పర్యావరణమన్నారు. పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు(శుక్రవారం) స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో కలిసి సైకిల్ ర్యాలీలో కేంద్రమంత్రి పాల్గొన్నారు. అనంతరం రామ్మోహన్ మాట్లాడుతూ... పర్యావరణ ప్రభావం మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం మీద ఉంటుందన్నారు. చిన్న వయసు నుంచే పర్యావరణ పరిరక్షణపై దృష్టి సారించాలని తెలిపారు. ప్రధాని మోదీ గత 12 సంవత్సరాలుగా స్వచ్ఛభారత్ కార్యక్రమం చేస్తున్నారని కేంద్ర మంత్రి అన్నారు. ప్రధానిని ఆదర్శంగా తీసుకొని దేశ వ్యాప్తంగా స్వచ్ఛభారత్ కొనసాగుతోందన్నారు. మోదీ...